ఒకటి కొకటి గూడ దువిదకడకు నిట్టె
(॥పల్లవి॥)
ఒకటి కొకటి గూడ దువిదకడకు నిట్టె
వెకలి విభునిఁ జేర విచ్చేయుమనవే
(॥॥)
పతియింటికేఁగేటిపడఁతి వేగిరానకు
సతిపిరిఁదిభారము సంగరమాయ
మతిలో నాతనిఁ బొందేమచ్చికకోరికలకు
మితిలేనివలపులే మీఁదమీఁదఁ దొడును
(॥॥)
సొలసి యాతనిఁ జూచేచూపులవాండ్లకు
చెలియానందజలాలు చిట్టంట్లాయ
మలసి యాతనితోడ మాటలాడేయందుకు
నిలుపునివ్వెరగులు నేరములై నిలిచె
(॥॥)
కమ్మర నాతని రతి కాఁగిలించేయందుకు
కొమ్మకంకణరవాలే కొండెములాయ
ఇమ్ముల శ్రీ వేంకటేశుఁ డింతలో విచ్చేసి కూడె
నెమ్మది నున్నారు నేఁడు నిన్ననే యింతాయను
(||pallavi||)
ŏgaḍi kŏgaḍi gūḍa duvidagaḍagu niṭṭĕ
vĕgali vibhunim̐ jera vichcheyumanave
(||||)
padiyiṁṭigem̐geḍibaḍam̐ti vegirānagu
sadibirim̐dibhāramu saṁgaramāya
madilo nādanim̐ bŏṁdemachchigagorigalagu
midilenivalabule mīm̐damīm̐dam̐ dŏḍunu
(||||)
sŏlasi yādanim̐ jūsesūbulavāṁḍlagu
sĕliyānaṁdajalālu siṭṭaṁṭlāya
malasi yādanidoḍa māḍalāḍeyaṁdugu
nilubunivvĕragulu neramulai nilisĕ
(||||)
kammara nādani radi kām̐giliṁcheyaṁdugu
kŏmmagaṁkaṇaravāle kŏṁḍĕmulāya
immula śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesi kūḍĕ
nĕmmadi nunnāru nem̐ḍu ninnane yiṁtāyanu