Ogadi koga tekkudu vorasina

ఒకటి కొక టెక్కుడు వొరసిన
Language

(॥పల్లవి॥)
ఒకటి కొక టెక్కుడు వొరసిన
మొకమోట లేల తుద మొద లెల్ల చెప్పరే

(॥ఒకటి॥)
విరులు కొప్పున రాల వేగి లేచి నిలుచుండి
తరుణి విభుని మోము తప్పక చూచె
సరుస నాతని కింతి చవి చూపెఁ దమ్ములము
యిరవైన మోహము లిందెవ్వరివి చెప్పరే

(॥ఒకటి॥)
నీరెండలు గాయుచును నేరుపున చిక్కు దీసి
సారెకు నాతనికిని జలజాక్షి
కోరి కోరి యాతఁడును కుచముల వీఁపు మోపి
మేర మీఁఱ వలపులు మించిన దిం దేదే

(॥ఒకటి॥)
పలచఁగా నవ్వు నవ్వి పయ్యద జారఁగాను
కలికి శ్రీవేంకటేశుఁ గౌఁగిలించెను
అల యంచు పచ్చడము ఆతఁ డట్టె పయిఁ గప్పె
తలకొన్నకూరిముల తగ వింకఁ జెప్పరే

(||pallavi||)
ŏgaḍi kŏga ṭĕkkuḍu vŏrasina
mŏgamoḍa lela tuda mŏda lĕlla sĕppare

(||ŏgaḍi||)
virulu kŏppuna rāla vegi lesi nilusuṁḍi
taruṇi vibhuni momu tappaga sūsĕ
sarusa nādani kiṁti savi sūbĕm̐ dammulamu
yiravaina mohamu liṁdĕvvarivi sĕppare

(||ŏgaḍi||)
nīrĕṁḍalu gāyusunu nerubuna sikku dīsi
sārĕgu nādanigini jalajākṣhi
kori kori yādam̐ḍunu kusamula vīm̐pu mobi
mera mīm̐ṟa valabulu miṁchina diṁ dede

(||ŏgaḍi||)
palasam̐gā navvu navvi payyada jāram̐gānu
kaligi śhrīveṁkaḍeśhum̐ gaum̐giliṁchĕnu
ala yaṁchu pachchaḍamu ādam̐ ḍaṭṭĕ payim̐ gappĕ
talagŏnnagūrimula taga viṁkam̐ jĕppare