Ogade senagamgaa nogadenum dadavevu

ఒకతె చెనకఁగా నొకతెనుఁ దడవేవు
Language

(॥పల్లవి॥)
ఒకతె చెనకఁగా నొకతెనుఁ దడవేవు
యెకసక్కెపువాఁడవు యేమనేది నిన్నును

(॥ఒకతె॥)
కందువైనమాటల కనుచూపుఁదేటలూ
సందడించి నీమీఁదఁ జల్లీనాపె
అందుకోలు మంతనాలు అడిగేటి పొంతనాలు
చందములుగా మాతోడ జరుపేవు నీవు

(॥ఒకతె॥)
సెలవులనవ్వులూ చెట్లపై పువ్వులూ
చలపట్టి నీమీఁదఁ జల్లీనాపె
చెలుముల ప్రియములు చిమ్మిరేఁగే నయములు
తలపెట్టి మమ్ము నిట్టే తగిలేవు నీవు

(॥ఒకతె॥)
నెట్టుకొన్నవలపులు నిండురతి యలపులు
జట్టిగొని నీమీఁదఁ జల్లీనాపె
ఱట్టగు మోవి విందులాఱడి మాతో పొందుల
గుట్టుతో శ్రీవేంకటేశ కూడితివి నీవు

(||pallavi||)
ŏgadĕ sĕnagam̐gā nŏgadĕnum̐ daḍavevu
yĕgasakkĕbuvām̐ḍavu yemanedi ninnunu

(||ŏgadĕ||)
kaṁduvainamāḍala kanusūbum̐deḍalū
saṁdaḍiṁchi nīmīm̐dam̐ jallīnābĕ
aṁdugolu maṁtanālu aḍigeḍi pŏṁtanālu
saṁdamulugā mādoḍa jarubevu nīvu

(||ŏgadĕ||)
sĕlavulanavvulū sĕṭlabai puvvulū
salabaṭṭi nīmīm̐dam̐ jallīnābĕ
sĕlumula priyamulu simmirem̐ge nayamulu
talabĕṭṭi mammu niṭṭe tagilevu nīvu

(||ŏgadĕ||)
nĕṭṭugŏnnavalabulu niṁḍuradi yalabulu
jaṭṭigŏni nīmīm̐dam̐ jallīnābĕ
ṟaṭṭagu movi viṁdulāṟaḍi mādo pŏṁdula
guṭṭudo śhrīveṁkaḍeśha kūḍidivi nīvu