ఒకటంటే వొకటన కొద్దు దోసము
(॥పల్లవి॥)
ఒకటంటే వొకటన కొద్దు దోసము
మొకమిచ్చలాడక మొరయవచ్చితినా
(॥ఒక॥)
చలములు నీతోనుసాదించవచ్చితినా
వలపులు పచరించవ్చితిఁగాక
తొలిలొలి నిను నిట్టె దొమ్మిసేయవచ్చితినా
చెలరేఁగి సేవలెల్లాఁ జేయవచ్చితిఁగాక
(॥ఒక॥)
పంతముల నీతోను పనిగొనవచ్చితినా
వంతులకు విడిమియ్యవచ్చితిఁగాక
మంతనాన నీతోను మచ్చరించవచ్చితినా
వింతెలెల్లా నీకు విన్నవించవచ్చితిఁగాక
(॥ఒక॥)
ఆసలఁబెట్టి నిన్నునలఇంచవచ్చితినా
వాసితో నీవు గూడఁగావచ్చితిఁగాక
బాసతో శ్రీవేంకటాద్రిఁ బాయనిగోవిందరాజ
మోసపుచ్చవచ్చితినా మొక్కవచ్చితిఁగాక
(||pallavi||)
ŏgaḍaṁṭe vŏgaḍana kŏddu dosamu
mŏgamichchalāḍaga mŏrayavachchidinā
(||ŏga||)
salamulu nīdonusādiṁchavachchidinā
valabulu pasariṁchavchidim̐gāga
tŏlilŏli ninu niṭṭĕ dŏmmiseyavachchidinā
sĕlarem̐gi sevalĕllām̐ jeyavachchidim̐gāga
(||ŏga||)
paṁtamula nīdonu panigŏnavachchidinā
vaṁtulagu viḍimiyyavachchidim̐gāga
maṁtanāna nīdonu machchariṁchavachchidinā
viṁtĕlĕllā nīgu vinnaviṁchavachchidim̐gāga
(||ŏga||)
āsalam̐bĕṭṭi ninnunala̮iṁchavachchidinā
vāsido nīvu gūḍam̐gāvachchidim̐gāga
bāsado śhrīveṁkaḍādrim̐ bāyanigoviṁdarāja
mosabuchchavachchidinā mŏkkavachchidim̐gāga