Ogadamte nogadane voorage neevu

ఒకటంటే నొకటనే వూరకే నీవు
Language

(॥పల్లవి॥)
ఒకటంటే నొకటనే వూరకే నీవు
వెకలియై నిన్నేమైనా వెంగెములాడెనా

(॥ఒక॥)
పక్కన నీమోవి చూచి పకపక నవ్వె నాపె
యెక్కువ నీమోవికెంపు లేడవనెనా
వెక్కనపునీపై చేయి విసరె నిప్పుడె ఆపె
చొక్కమై నీవుసేసినసుద్దులు దడవెనా

(॥ఒక॥)
కళదేరేనీమేనికాంతులు వొగడె నాపె
అలరి వున్నాఁడవు నిన్నదేమనెనా
అలసినందుకు పన్నీ రట్టె నీపైఁ జల్లెఁగాక
కలనీసేఁతలు యెఱుకలు సేసుకొనేనా

(॥ఒక॥)
చిమ్మిరేఁగేనీనెరులు చిక్కులుదీసె నాపె
పమ్మి నిన్ను యిట్టే సిగ్గువడఁజేసేనా
కమ్మి శ్రీవేంకటేశుఁడ కలసె నలమేల్మంగ
కుమ్మరించి నీపై బత్తి కొత్తలుగఁ జేసెనా

(||pallavi||)
ŏgaḍaṁṭe nŏgaḍane vūrage nīvu
vĕgaliyai ninnemainā vĕṁgĕmulāḍĕnā

(||ŏga||)
pakkana nīmovi sūsi pagabaga navvĕ nābĕ
yĕkkuva nīmovigĕṁpu leḍavanĕnā
vĕkkanabunībai seyi visarĕ nippuḍĕ ābĕ
sŏkkamai nīvusesinasuddulu daḍavĕnā

(||ŏga||)
kaḽaderenīmenigāṁtulu vŏgaḍĕ nābĕ
alari vunnām̐ḍavu ninnademanĕnā
alasinaṁdugu pannī raṭṭĕ nībaim̐ jallĕm̐gāga
kalanīsem̐talu yĕṟugalu sesugŏnenā

(||ŏga||)
simmirem̐genīnĕrulu sikkuludīsĕ nābĕ
pammi ninnu yiṭṭe sigguvaḍam̐jesenā
kammi śhrīveṁkaḍeśhum̐ḍa kalasĕ nalamelmaṁga
kummariṁchi nībai batti kŏttalugam̐ jesĕnā