ఒక రొకరికె మన మొద్దిక గాదా । నీకు
(॥పల్లవి॥)
ఒక రొకరికె మన మొద్దిక గాదా । నీకు
వెకలి రతుల ముందువెనక గానా
(॥ఒక॥)
కోమలి నీకుచములు కొండలైతే నామీది-
చేమలుచెట్లుఁబో నాచేతులివి
యేమిటా నీజవ్వనమే యెక్కుడుఁగా నెంచుకొంటే
ఆమీఁదిఫలభోగ మది నేఁ గానా
(॥ఒక॥)
కలికి నీకన్ను లివి కమలము లనుకొంటేఁ
దొలకు నాచూపులునుఁ దుమ్మిద లివి
చెలువాన నీవెంట చెలరేఁగినా నీకు
అలరి యెవ్వరిపను లంతకు నేఁ గానా
(॥ఒక॥)
అంగన నీచెమటలే అంబుధియైతే నేఁ
జెంగలించి వోలలాడే శేషశాయిని
సంగతి నీకూటమే సారెకు మెచ్చవు నేఁ
గంగులేని శ్రీవేంకటపతిఁ గానా
(||pallavi||)
ŏga rŏgarigĕ mana mŏddiga gādā | nīgu
vĕgali radula muṁduvĕnaga gānā
(||ŏga||)
komali nīgusamulu kŏṁḍalaide nāmīdi-
semalusĕṭlum̐bo nāsedulivi
yemiḍā nījavvaname yĕkkuḍum̐gā nĕṁchugŏṁṭe
āmīm̐diphalabhoga madi nem̐ gānā
(||ŏga||)
kaligi nīgannu livi kamalamu lanugŏṁṭem̐
dŏlagu nāsūbulunum̐ dummida livi
sĕluvāna nīvĕṁṭa sĕlarem̐ginā nīgu
alari yĕvvaribanu laṁtagu nem̐ gānā
(||ŏga||)
aṁgana nīsĕmaḍale aṁbudhiyaide nem̐
jĕṁgaliṁchi volalāḍe śheṣhaśhāyini
saṁgadi nīgūḍame sārĕgu mĕchchavu nem̐
gaṁguleni śhrīveṁkaḍabadim̐ gānā