ఒదుకఁగలవు పెక్కుపడఁతులలోన నెల్లా
(॥పల్లవి॥)
ఒదుకఁగలవు పెక్కుపడఁతులలోన నెల్లా
పదర వన్నిటికిని బందుగుఁడవయ్యా
(॥బదుక॥)
కోరి యిందరు ముడిచే కొప్పులోని తామెరవు
గారాబుఁ జన్నులఁ బూసే గందమవు
చేరి పరిమళించే చెవిలో జవ్వాదివి
నేరుత విన్నిటా నిఁక నిన్నేమనేమయ్యా
(॥బదుక॥)
కొండుక పాయపువారి కొడివేలుంగరమవు
అండనే మెడఁ దగిలే హారమవు
దండిగా వినయాన పాదాలఁ బెట్టిన యందెవు
నిండా నల్లుకొంటి విఁక నిన్నేమనేమయ్యా
(॥బదుక॥)
కావలె ననేటివారి కట్టినట్టి చీరవు
మూవంక రతివేళ మేల్ముసుఁగవు
శ్రీ వేంకటేశ నన్నుఁ జెందితి వింతటిలోనే
నీవంగడిసరకవు నిన్నేమనేమయ్యా
(||pallavi||)
ŏdugam̐galavu pĕkkubaḍam̐tulalona nĕllā
padara vanniḍigini baṁdugum̐ḍavayyā
(||baduga||)
kori yiṁdaru muḍise kŏppuloni tāmĕravu
gārābum̐ jannulam̐ būse gaṁdamavu
seri parimaḽiṁche sĕvilo javvādivi
neruda vinniḍā nim̐ka ninnemanemayyā
(||baduga||)
kŏṁḍuga pāyabuvāri kŏḍiveluṁgaramavu
aṁḍane mĕḍam̐ dagile hāramavu
daṁḍigā vinayāna pādālam̐ bĕṭṭina yaṁdĕvu
niṁḍā nallugŏṁṭi vim̐ka ninnemanemayyā
(||baduga||)
kāvalĕ naneḍivāri kaṭṭinaṭṭi sīravu
mūvaṁka radiveḽa melmusum̐gavu
śhrī veṁkaḍeśha nannum̐ jĕṁdidi viṁtaḍilone
nīvaṁgaḍisaragavu ninnemanemayyā