ఒద్దు వొద్దు చాలుఁ జాలు నోపదయ్యా
(॥పల్లవి॥)
ఒద్దు వొద్దు చాలుఁ జాలు నోపదయ్యా
ఇద్దరి తమకముల నిఁక యెంతయౌనో
(॥ఒద్దు॥)
కొమ్మ నీతో నవ్వఁగాను కొప్పున విరులు రాలె
చిమ్ముఁజూపులు చూడఁగఁ జెమరించెను
నెమ్మి సాగిలి మొక్కఁగా నిట్టూరుపులు రేఁగె
యెమ్మెల పొందుసేసితే నిఁక నెంతయౌనో
(॥ఒద్దు॥)
సంగడిఁ గూచుండఁగాను జాజుకొనఁ బులకించె
అంగవించి మాటాడఁగా నాయము లంటె
ముంగిటఁ జెనకఁగాను మోపులాయ వలపులు
యెంగిలిమోవి పొత్తుల నిఁక నెంతయౌనో
(॥ఒద్దు॥)
గక్కనఁ గాంగిలించఁగా కడుఁ గరఁగె మనసు
చెక్కునొక్కఁగా సిగ్గులు చిమ్మిరేఁగెను
మక్కువ శ్రీవేంకటేశ మానినిఁ గూఁడితి విట్టె
ఇక్కువలెల్ల నంటఁగా నిఁక నెంతయౌనో
(||pallavi||)
ŏddu vŏddu sālum̐ jālu nobadayyā
iddari tamagamula nim̐ka yĕṁtayauno
(||ŏddu||)
kŏmma nīdo navvam̐gānu kŏppuna virulu rālĕ
simmum̐jūbulu sūḍam̐gam̐ jĕmariṁchĕnu
nĕmmi sāgili mŏkkam̐gā niṭṭūrubulu rem̐gĕ
yĕmmĕla pŏṁduseside nim̐ka nĕṁtayauno
(||ŏddu||)
saṁgaḍim̐ gūsuṁḍam̐gānu jājugŏnam̐ bulagiṁchĕ
aṁgaviṁchi māḍāḍam̐gā nāyamu laṁṭĕ
muṁgiḍam̐ jĕnagam̐gānu mobulāya valabulu
yĕṁgilimovi pŏttula nim̐ka nĕṁtayauno
(||ŏddu||)
gakkanam̐ gāṁgiliṁcham̐gā kaḍum̐ garam̐gĕ manasu
sĕkkunŏkkam̐gā siggulu simmirem̐gĕnu
makkuva śhrīveṁkaḍeśha māninim̐ gūm̐ḍidi viṭṭĕ
ikkuvalĕlla naṁṭam̐gā nim̐ka nĕṁtayauno