ఒద్దు వొద్దు నిన్నుఁజూచి వూరకుండేను
(॥పల్లవి॥)
ఒద్దు వొద్దు నిన్నుఁజూచి వూరకుండేను
సుద్దుల నీ చేఁతలు సోదించ నిఁకను
(॥ఒద్దు॥)
అంగడి నున్నది చిత్త మప్పట నుండి నీకు
కొంగువట్టి నేఁ దీసితే కోపమురాదా
ఇంగిత మెఱఁగకున్న నేది జాణతనము
వెంగిలితనాన నిన్ను వేసరించ నిఁకను
(॥ఒద్దు॥)
తత్తరాన నున్నది నీతనువు అప్పటనుండి
అత్తి నేఁ బెనఁగితే నీ కలపుగాదా
ఇత్తన గుట్టులేకున్న నేది దొరతనము
పొత్తుల మంకుదనాన బోదించ నిఁకను
(॥ఒద్దు॥)
పైపై నున్నది నీభావ మప్పటనుండి
చేపట్టి నేఁ గూడకుంటే చింత రేఁగదా
కాపాడి శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
దాఁపుల బేలుఁదనాన రవ్వసేయ నిఁకను
(||pallavi||)
ŏddu vŏddu ninnum̐jūsi vūraguṁḍenu
suddula nī sem̐talu sodiṁcha nim̐kanu
(||ŏddu||)
aṁgaḍi nunnadi sitta mappaḍa nuṁḍi nīgu
kŏṁguvaṭṭi nem̐ dīside kobamurādā
iṁgida mĕṟam̐gagunna nedi jāṇadanamu
vĕṁgilidanāna ninnu vesariṁcha nim̐kanu
(||ŏddu||)
tattarāna nunnadi nīdanuvu appaḍanuṁḍi
atti nem̐ bĕnam̐gide nī kalabugādā
ittana guṭṭulegunna nedi dŏradanamu
pŏttula maṁkudanāna bodiṁcha nim̐kanu
(||ŏddu||)
paibai nunnadi nībhāva mappaḍanuṁḍi
sebaṭṭi nem̐ gūḍaguṁṭe siṁta rem̐gadā
kābāḍi śhrī veṁkaḍeśha kalasidi viḍu nannu
dām̐pula belum̐danāna ravvaseya nim̐kanu