ఒద్దు వొద్దు నన్ను నేల వొడఁబరచేదే మీరు
(॥పల్లవి॥)
ఒద్దు వొద్దు నన్ను నేల వొడఁబరచేదే మీరు
సుద్దులు చెప్పినంతనే సూడు వాసెనటవే
(॥ఒద్దు॥)
నవ్వులేల నిజమౌనే నాయము నాయమే కాక
రవ్వకాఁడై నన్నెంత రచ్చ వేసీనే
పువ్వులు ముడిచినతల పూరి మోవవచ్చునా
యెవ్వతెఁ దాఁ బొగడినా నేల వినేనే
(॥ఒద్దు॥)
మొక్కులేల తగులౌనే మోహము మోహమే కాక
వెక్కసీఁడై నన్నునేల వెడ్డు వెట్టీనే
చిక్కని తేనెల మోవి చేఁదు మేయవచ్చునా
పక్కన సవతికేల పంత మిచ్చెనే
(॥ఒద్దు॥)
వేసటేల సతమౌనే వేడుక వేడుకే కాక
ఆసకాఁడై నన్ను నేల అంటుకొనీనే
బాస ఇచ్చి శ్రీ వేంకటపతి నన్ను నిదె కూడె
బేసబెల్లి వారికేల పిరితేసేనే
(||pallavi||)
ŏddu vŏddu nannu nela vŏḍam̐barasede mīru
suddulu sĕppinaṁtane sūḍu vāsĕnaḍave
(||ŏddu||)
navvulela nijamaune nāyamu nāyame kāga
ravvagām̐ḍai nannĕṁta rachcha vesīne
puvvulu muḍisinadala pūri movavachchunā
yĕvvadĕm̐ dām̐ bŏgaḍinā nela vinene
(||ŏddu||)
mŏkkulela tagulaune mohamu mohame kāga
vĕkkasīm̐ḍai nannunela vĕḍḍu vĕṭṭīne
sikkani tenĕla movi sem̐du meyavachchunā
pakkana savadigela paṁta michchĕne
(||ŏddu||)
vesaḍela sadamaune veḍuga veḍuge kāga
āsagām̐ḍai nannu nela aṁṭugŏnīne
bāsa ichchi śhrī veṁkaḍabadi nannu nidĕ kūḍĕ
besabĕlli vārigela piridesene