ఒద్దికై నీ నగరిలో నున్నదే చాలు
(॥పల్లవి॥)
ఒద్దికై నీ నగరిలో నున్నదే చాలు
అద్దుకొని పట్టితేను ఆసకత్తెనందువు
(॥॥)
పలుమారు నిన్ను నేనుఁ బైకొని చెనకఁగాను
మలసీ నిదెంత చలమరి యందువు
వలచి యేపొద్దు నీవద్దఁ గాచుక వుంటేను
బలిమి నప్పటి మరి బట్టగుత్తూ నందువు
(॥॥)
మగిడి మగిడి నీతో మాటలెల్లా నాడఁగాను
యెగసక్కెము సేసీ నిదేఁటిదందువు
మిగులా నీకూడిగాలు మేను ముట్టి సేసితేను
వెగటుగా నిదియెంత వేసరించీనందువు
(॥॥)
గక్కనను నే వచ్చి కాఁగిలించుకొంటేను
కక్కసించీ నిది యెంత కల్లరందువు
యిక్కువ శ్రీవేంకటేశ యిటు నీవే కూడితివి
మొక్కితి నన్నిటా నన్నుఁ జొక్కించెనందువు
(||pallavi||)
ŏddigai nī nagarilo nunnade sālu
addugŏni paṭṭidenu āsagattĕnaṁduvu
(||||)
palumāru ninnu nenum̐ baigŏni sĕnagam̐gānu
malasī nidĕṁta salamari yaṁduvu
valasi yebŏddu nīvaddam̐ gāsuga vuṁṭenu
balimi nappaḍi mari baṭṭaguttū naṁduvu
(||||)
magiḍi magiḍi nīdo māḍalĕllā nāḍam̐gānu
yĕgasakkĕmu sesī nidem̐ṭidaṁduvu
migulā nīgūḍigālu menu muṭṭi sesidenu
vĕgaḍugā nidiyĕṁta vesariṁchīnaṁduvu
(||||)
gakkananu ne vachchi kām̐giliṁchugŏṁṭenu
kakkasiṁchī nidi yĕṁta kallaraṁduvu
yikkuva śhrīveṁkaḍeśha yiḍu nīve kūḍidivi
mŏkkidi nanniḍā nannum̐ jŏkkiṁchĕnaṁduvu