Oddigadom goodimaadi vumdaraadaa

ఒద్దికతోఁ గూడిమాడి వుండరాదా
Language

(॥పల్లవి॥)
ఒద్దికతోఁ గూడిమాడి వుండరాదా
సుద్దు లేమి చెప్పేవే సులభాన నీవు

(॥॥)
ఇప్పుడే యెవ్వతెతోనో యీవిభుఁడు నవ్వెనంటా
చెప్పుడుమాటలకేల చెవియొగ్గేవే
కొప్పు జారివున్నదంటా కొంగు పసపాయనంటా
చొప్పులేల యేత్తేవే సొలయుచు నీవు

(॥॥)
కోడెవనితలతోడ గుట్టునఁ బెనఁగెనంటా
వేడుకచేఁతల కేల వెరగందేవే
వాడినది మోవియంటా వడిసీఁ జెమటంటా
ఆడిక లేలాడేవే అందరిలో నీవు

(॥॥)
కన్నె పెండ్లి కూతురు కై దండ వట్టెనంటా
సన్నల రతుల కేల సాదించేవే
ఇన్నిటా శ్రీ వేంకటుశుఁ డేలెనంటా మెచ్చెనంటా
నిన్ను నేల పొగడేవే నెట్టుకొని నీవు

(||pallavi||)
ŏddigadom̐ gūḍimāḍi vuṁḍarādā
suddu lemi sĕppeve sulabhāna nīvu

(||||)
ippuḍe yĕvvadĕdono yīvibhum̐ḍu navvĕnaṁṭā
sĕppuḍumāḍalagela sĕviyŏggeve
kŏppu jārivunnadaṁṭā kŏṁgu pasabāyanaṁṭā
sŏppulela yetteve sŏlayusu nīvu

(||||)
koḍĕvanidaladoḍa guṭṭunam̐ bĕnam̐gĕnaṁṭā
veḍugasem̐tala kela vĕragaṁdeve
vāḍinadi moviyaṁṭā vaḍisīm̐ jĕmaḍaṁṭā
āḍiga lelāḍeve aṁdarilo nīvu

(||||)
kannĕ pĕṁḍli kūduru kai daṁḍa vaṭṭĕnaṁṭā
sannala radula kela sādiṁcheve
inniḍā śhrī veṁkaḍuśhum̐ ḍelĕnaṁṭā mĕchchĕnaṁṭā
ninnu nela pŏgaḍeve nĕṭṭugŏni nīvu