Oddigado mamu neevu voorage soodamga raadaa

ఒద్దికతో మము నీవు వూరకె చూడఁగ రాదా
Language

(॥పల్లవి॥)
ఒద్దికతో మము నీవు వూరకె చూడఁగ రాదా
చద్దికి వేఁడికి మేమే సంతము లయ్యేము

(॥ఒద్దికతో॥)
యిద్దము నేకతము నాయెదటనె ఆడఁగాను
వుద్దంగాలు సేయక యెట్టోరుతు నేను
వొద్ద నీ వుండగా నింతి నొరసితి ననివాదు
వద్దన్నా మానక యేల వహించుకొనేవు

(॥ఒద్దికతో॥)
జాఱక నీవును నాపె సన్నలు సేసుకోఁగాను
చూఱలుగ నెలువలెఁ జూతు నేను
మీఱి నీ మంచముమీఁదిమెలుత నంటితి నని
ఆఱడి నీ వేల ఆపె కడ్డాలు వచ్చేవు

(॥ఒద్దికతో॥)
చెక్కు నొక్కి నీవు నది సెలవుల నవ్వుకోఁగా
తెక్కుల నెట్ల సమ్మతింతు నేను
చిక్కించి నిన్నుఁ గూడితి శ్రీవెంకటేశ్వర నేను
కక్కసించితే నాపెకుఁగా నేల మొక్కేవు

(||pallavi||)
ŏddigado mamu nīvu vūragĕ sūḍam̐ga rādā
saddigi vem̐ḍigi meme saṁtamu layyemu

(||ŏddigado||)
yiddamu negadamu nāyĕdaḍanĕ āḍam̐gānu
vuddaṁgālu seyaga yĕṭṭorudu nenu
vŏdda nī vuṁḍagā niṁti nŏrasidi nanivādu
vaddannā mānaga yela vahiṁchugŏnevu

(||ŏddigado||)
jāṟaga nīvunu nābĕ sannalu sesugom̐gānu
sūṟaluga nĕluvalĕm̐ jūdu nenu
mīṟi nī maṁchamumīm̐dimĕluda naṁṭidi nani
āṟaḍi nī vela ābĕ kaḍḍālu vachchevu

(||ŏddigado||)
sĕkku nŏkki nīvu nadi sĕlavula navvugom̐gā
tĕkkula nĕṭla sammadiṁtu nenu
sikkiṁchi ninnum̐ gūḍidi śhrīvĕṁkaḍeśhvara nenu
kakkasiṁchide nābĕgum̐gā nela mŏkkevu