Oddanunnadaana nenu vokkadi gaam dadavaa

ఒద్దనున్నదాన నేను వొక్కటి గాఁ దదవా
Language

(॥పల్లవి॥)
ఒద్దనున్నదాన నేను వొక్కటి గాఁ దదవా
దిద్దుకోఁగల మాటెల్ల తేరుచుకొమ్మనవే

(॥ఒద్ద॥)
తన మేలే కలితేను తాపముఁ బాసేఁ గాక
ఘనుఁడు నిన్నే లంపె యిక్కడికి నేఁడు
మనసుతో నున్నదాన మారుమాట లాడేనా
మనుపటివారి బాస ముగియించు మనవే

(॥ఒద్ద॥)
యేకత మైనవేళ యిట్టె నే వచ్చేఁ గాక
యీకడ మాయింటికిఁ దా నేల వచ్చీనే
చేకొలఁదిదాన నేను చిత్తము నొప్పించేనా
పై కొన్న వారి పొందులపని దీర్చు మనవే

(॥ఒద్ద॥)
నే వెట్టినట్టిదాన సేవలు సేసేఁ గాక
ఆస నేల వేఁడుకోనీ నప్పటిఁ దానూ
వేసరక నన్నును శ్రీవెంకటేశ్వరుఁడు గూడె
రాసి కెక్కె నీవలపు రవ్వ మాను మనవే

(||pallavi||)
ŏddanunnadāna nenu vŏkkaḍi gām̐ dadavā
diddugom̐gala māḍĕlla terusugŏmmanave

(||ŏdda||)
tana mele kalidenu tābamum̐ bāsem̐ gāga
ghanum̐ḍu ninne laṁpĕ yikkaḍigi nem̐ḍu
manasudo nunnadāna mārumāḍa lāḍenā
manubaḍivāri bāsa mugiyiṁchu manave

(||ŏdda||)
yegada mainaveḽa yiṭṭĕ ne vachchem̐ gāga
yīgaḍa māyiṁṭigim̐ dā nela vachchīne
segŏlam̐didāna nenu sittamu nŏppiṁchenā
pai kŏnna vāri pŏṁdulabani dīrsu manave

(||ŏdda||)
ne vĕṭṭinaṭṭidāna sevalu sesem̐ gāga
āsa nela vem̐ḍugonī nappaḍim̐ dānū
vesaraga nannunu śhrīvĕṁkaḍeśhvarum̐ḍu gūḍĕ
rāsi kĕkkĕ nīvalabu ravva mānu manave