Oddanunna kaamtalagu nullamulu garagenu

ఒద్దనున్న కాంతలకు నుల్లములు గరగెను
Language

(॥పల్లవి॥)
ఒద్దనున్న కాంతలకు నుల్లములు గరగెను
సుద్దులేమి చెప్పేము చూతువు రావయ్యా

(॥॥)
పట్టెమంచము మీఁదటఁ బవ్వళించీని చెలియ
నెట్టుకొన్నవేడుకతో నిన్నుఁ దలఁచి
గుట్టున మనోరథాలు గోరుకోంటా ముక్కుమీఁది-
జుట్టవేలితో నున్నది చూతువు రావయ్యా

(॥॥)
వొక్కతె యేకతముననండి యుల్లసముతోడ
పక్కన నీమీఁదటి పదాలు వాడి
యిక్కువ నీమోవితేనె కేకట నోరూరుకొంటా
చొక్కి నిట్టూర్పులు నించీఁ జూతువు రావయ్యా

(॥॥)
ఇట్టె నీవు రాగా శిరసెత్తి నీమొగము చూచి
గట్టిగా శ్రీ వేంకటేశ కాఁగిట గూడిఁ
నెట్టుకొని రతులను నిన్ను మెప్పించీ దినముఁ
జుట్టి చుట్టి ఇట్లానే చూతువు రావయ్యా

(||pallavi||)
ŏddanunna kāṁtalagu nullamulu garagĕnu
suddulemi sĕppemu sūduvu rāvayyā

(||||)
paṭṭĕmaṁchamu mīm̐daḍam̐ bavvaḽiṁchīni sĕliya
nĕṭṭugŏnnaveḍugado ninnum̐ dalam̐si
guṭṭuna manorathālu gorugoṁṭā mukkumīm̐di-
juṭṭavelido nunnadi sūduvu rāvayyā

(||||)
vŏkkadĕ yegadamunanaṁḍi yullasamudoḍa
pakkana nīmīm̐daḍi padālu vāḍi
yikkuva nīmovidenĕ kegaḍa norūrugŏṁṭā
sŏkki niṭṭūrbulu niṁchīm̐ jūduvu rāvayyā

(||||)
iṭṭĕ nīvu rāgā śhirasĕtti nīmŏgamu sūsi
gaṭṭigā śhrī veṁkaḍeśha kām̐giḍa gūḍim̐
nĕṭṭugŏni radulanu ninnu mĕppiṁchī dinamum̐
juṭṭi suṭṭi iṭlāne sūduvu rāvayyā