Oddanumtem jappanaunu vobamu nemu

ఒద్దనుంటేఁ జప్పనౌను వోపము నేము
Language

(॥పల్లవి॥)
ఒద్దనుంటేఁ జప్పనౌను వోపము నేము
సుద్దులు చెప్పినంతనే చొక్కేము నేము

(॥ఒద్ద॥)
కలిగితే మోహమెల్లా గాదెఁ బోసుకొమ్మనవే
సొలపుమాటల మాకుఁ జూపఁగనేల
చెలులాల మనసెల్లాఁజిల్లులాయ నిందుననే
తలఁచి దవ్వులపొందే తనివాయ మాకు

(॥ఒద్ద॥)
రాజ మెంతగల్లాను రాసి చేసుకొమ్మనవే
జాజుకొన మాయెడఁ బచరించ నేల
వోజతోడ నిందుననే వుడుకెత్తె మేనెల్లా
తేజానఁ బెండ్లినాఁడే తేఁకువాయ మాకు

(॥ఒద్ద॥)
ముంచి నవ్వులేమి గల్లా మూఁట గట్టు కొమ్మనవే
వంచి మాపైనేల చల్లీ వరుఁస దాను
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
మించి వుర మెక్కించుటే మేలాయ నాకు

(||pallavi||)
ŏddanuṁṭem̐ jappanaunu vobamu nemu
suddulu sĕppinaṁtane sŏkkemu nemu

(||ŏdda||)
kaligide mohamĕllā gādĕm̐ bosugŏmmanave
sŏlabumāḍala māgum̐ jūbam̐ganela
sĕlulāla manasĕllām̐jillulāya niṁdunane
talam̐si davvulabŏṁde tanivāya māgu

(||ŏdda||)
rāja mĕṁtagallānu rāsi sesugŏmmanave
jājugŏna māyĕḍam̐ basariṁcha nela
vojadoḍa niṁdunane vuḍugĕttĕ menĕllā
tejānam̐ bĕṁḍlinām̐ḍe tem̐kuvāya māgu

(||ŏdda||)
muṁchi navvulemi gallā mūm̐ṭa gaṭṭu kŏmmanave
vaṁchi mābainela sallī varum̐sa dānu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
miṁchi vura mĕkkiṁchuḍe melāya nāgu