ఒద్దన్నా మానవు నీ వోజ లిట్టివి
(॥పల్లవి॥)
ఒద్దన్నా మానవు నీ వోజ లిట్టివి
పెద్దరికము సేయుచుఁ బ్రియము లాడేవు
(॥ఒద్దన్నా॥)
నివ్వటివల్ల నీ నవ్వు నేఁడె నాతో వలెనా
వువ్విళ్లూర రేపు గొంత వుండనీరాదా
జవ్వనపువాఁడవు నీసరివారమా నేము
దవ్వుల నుండి మొక్కితే దగ్గరఁ బిలిచేవూ
(॥ఒద్దన్నా॥)
కోయ్య నా మాటలు నాకొరకె నేరిచితివా
అయ్యో యీవేళకుఁ దగి నంతే చాలదా
గయ్యాళించి నిన్ను నేమౌఁ గా దనేనటివారమా
పయ్యద నే మూసుకొంటే పై నేల వొరగేవు
(॥ఒద్దన్నా॥)
కన్నులసన్నలు నాకే గాదెఁ బోసు కుండితివా
పన్ని పైఁడియమ్ము లిన్నీఁ బార వేసేవా
యిన్నిటా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
మన్ననలు పొగడితె మర్మము లంటేవు
(||pallavi||)
ŏddannā mānavu nī voja liṭṭivi
pĕddarigamu seyusum̐ briyamu lāḍevu
(||ŏddannā||)
nivvaḍivalla nī navvu nem̐ḍĕ nādo valĕnā
vuvviḽlūra rebu gŏṁta vuṁḍanīrādā
javvanabuvām̐ḍavu nīsarivāramā nemu
davvula nuṁḍi mŏkkide daggaram̐ bilisevū
(||ŏddannā||)
koyya nā māḍalu nāgŏragĕ nerisidivā
ayyo yīveḽagum̐ dagi naṁte sāladā
gayyāḽiṁchi ninnu nemaum̐ gā danenaḍivāramā
payyada ne mūsugŏṁṭe pai nela vŏragevu
(||ŏddannā||)
kannulasannalu nāge gādĕm̐ bosu kuṁḍidivā
panni paim̐ḍiyammu linnīm̐ bāra vesevā
yinniḍā śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
mannanalu pŏgaḍidĕ marmamu laṁṭevu