Oddannaa maanavu nannu nodambarasevu nee

ఒద్దన్నా మానవు నన్ను నొడఁబరచేవు నీ
Language

(॥పల్లవి॥)
ఒద్దన్నా మానవు నన్ను నొడఁబరచేవు నీ-
వద్ద యెమ్మెలు మెఱయ వారు వీరు చాలరా

(॥ఒద్దన్నా॥)
కొండవంటి దొర వని కుంచ నీవు వేయఁ గా న
న్నండఁ గూచుండు మనుచు నాన వెట్టేవూ
దండితోడ నూడిగపుదాన నయ్యే నంటే నేల
చండి పోరి నీదేవులసానిఁ జేసే వయ్యా

(॥ఒద్దన్నా॥)
అందచందమునను నీ కాకు మడి చియ్యఁ గాను
అందల మెక్కు మనుచు నాన వెట్టేవూ
గొందినె నీపాదాలు గొలిచి వచ్చే నంటే
యిందరిలో దొర గాన న్నెంత సేసే వయ్యా

(॥ఒద్దన్నా॥)
కట్టడతో నీమేనఁ గస్తూరి నేఁ బూయఁ గాను
అట్టె కాగిలించు మంటా నాన వెట్టేవూ
గుట్టుతో శ్రీవెంకటేశ కూడితి వింతలో నన్ను
మట్టుతో నుండఁగా నెంత మన్నించే వయ్యా

(||pallavi||)
ŏddannā mānavu nannu nŏḍam̐barasevu nī-
vadda yĕmmĕlu mĕṟaya vāru vīru sālarā

(||ŏddannā||)
kŏṁḍavaṁṭi dŏra vani kuṁcha nīvu veyam̐ gā na
nnaṁḍam̐ gūsuṁḍu manusu nāna vĕṭṭevū
daṁḍidoḍa nūḍigabudāna nayye naṁṭe nela
saṁḍi pori nīdevulasānim̐ jese vayyā

(||ŏddannā||)
aṁdasaṁdamunanu nī kāgu maḍi siyyam̐ gānu
aṁdala mĕkku manusu nāna vĕṭṭevū
gŏṁdinĕ nībādālu gŏlisi vachche naṁṭe
yiṁdarilo dŏra gāna nnĕṁta sese vayyā

(||ŏddannā||)
kaṭṭaḍado nīmenam̐ gastūri nem̐ būyam̐ gānu
aṭṭĕ kāgiliṁchu maṁṭā nāna vĕṭṭevū
guṭṭudo śhrīvĕṁkaḍeśha kūḍidi viṁtalo nannu
maṭṭudo nuṁḍam̐gā nĕṁta manniṁche vayyā