ఒద్దనే నే నున్నదాన వున్నది నీవెఱఁగవు
(॥పల్లవి॥)
ఒద్దనే నే నున్నదాన వున్నది నీవెఱఁగవు
గద్దించి చూడవైతివి కామాంధకారానను
(॥ఒద్ద॥)
హత్తి నీతోఁ బొందుసేసి ఆయములు గరఁగించి
బిత్తరిమాటలాడెఁగా ప్రియురాలు
లత్తుకరసాలతోడిలలితంపుఁగొనగోర-
నొత్తి నిన్ను సన్న సేసి వొరసెఁగా అపుడు
(॥ఒద్ద॥)
పెనఁగి కాఁకలు చల్లి బిరుదులెల్లా నెరపి
చనవు మెరసెఁగా జవరాలు
తనివోనిముచ్చటల తమకము రేఁచిరేఁచి
పనిగొనెఁగా ఆపె పంతమున నపుడు
(॥ఒద్ద॥)
గక్కనఁ గాఁగిలించి కన్నులు దేలగింపుచు
మొక్కి వూరకె వుండెఁగా ముద్దరాలు
అక్కడ శ్రీవేంకటేశ ఆవేళ నన్నుఁ గూడితి
తెక్కులనీతమకము తెలిసెఁగా అపుడు
(||pallavi||)
ŏddane ne nunnadāna vunnadi nīvĕṟam̐gavu
gaddiṁchi sūḍavaidivi kāmāṁdhagārānanu
(||ŏdda||)
hatti nīdom̐ bŏṁdusesi āyamulu garam̐giṁchi
bittarimāḍalāḍĕm̐gā priyurālu
lattugarasāladoḍilalidaṁpum̐gŏnagora-
nŏtti ninnu sanna sesi vŏrasĕm̐gā abuḍu
(||ŏdda||)
pĕnam̐gi kām̐kalu salli birudulĕllā nĕrabi
sanavu mĕrasĕm̐gā javarālu
tanivonimuchchaḍala tamagamu rem̐sirem̐si
panigŏnĕm̐gā ābĕ paṁtamuna nabuḍu
(||ŏdda||)
gakkanam̐ gām̐giliṁchi kannulu delagiṁpusu
mŏkki vūragĕ vuṁḍĕm̐gā muddarālu
akkaḍa śhrīveṁkaḍeśha āveḽa nannum̐ gūḍidi
tĕkkulanīdamagamu tĕlisĕm̐gā abuḍu