Odda nunnaa radigo voorivaarellaa

ఒద్ద నున్నా రదిగో వూరివారెల్లా
Language

(॥పల్లవి॥)
ఒద్ద నున్నా రదిగో వూరివారెల్లా
ముద్ద గట్టే ఆసలెల్లా మోఁపు గట్టుకోరాదా

(॥ఒద్ద॥)
పంతములు నీతోనా బలుములు నీతోనా
ఇంతటి దొరవు నీతో నేమనవచ్చు
కాంతలము మమ్ము నేల కడు రట్టు సే సేవు
దొంతి నున్న వలపులు తొడికి తియ్యరాదా

(॥ఒద్ద॥)
చలములు నీతోనా సాదింపులు నీతోనా
యెలమి దేవరవు నిన్నేమన వచ్చు
చెలులము మమ్మునేల సిగ్గులు వరపించేవు
వొలుగులువారీ నవ్వు వొడిగట్టుకోరాదా

(॥ఒద్ద॥)
దిట్టతనము నీతోనా దీమసము నీతోనా
ఇట్టె శ్రీ వేంకటేశ నిన్నేమన వచ్చు
మెట్టుక కూడితి వలమేలుమంగనైన నన్ను
జట్టి గొన్న వేడుకలు జాళెఁ బోసుకోరాదా

(||pallavi||)
ŏdda nunnā radigo vūrivārĕllā
mudda gaṭṭe āsalĕllā mom̐pu gaṭṭugorādā

(||ŏdda||)
paṁtamulu nīdonā balumulu nīdonā
iṁtaḍi dŏravu nīdo nemanavachchu
kāṁtalamu mammu nela kaḍu raṭṭu se sevu
dŏṁti nunna valabulu tŏḍigi tiyyarādā

(||ŏdda||)
salamulu nīdonā sādiṁpulu nīdonā
yĕlami devaravu ninnemana vachchu
sĕlulamu mammunela siggulu varabiṁchevu
vŏluguluvārī navvu vŏḍigaṭṭugorādā

(||ŏdda||)
diṭṭadanamu nīdonā dīmasamu nīdonā
iṭṭĕ śhrī veṁkaḍeśha ninnemana vachchu
mĕṭṭuga kūḍidi valamelumaṁganaina nannu
jaṭṭi gŏnna veḍugalu jāḽĕm̐ bosugorādā