ఒడఁబరచఁగనేల వొడివట్టి న న్నింతేసి
(॥పల్లవి॥)
ఒడఁబరచఁగనేల వొడివట్టి న న్నింతేసి
వుడివోని సంతోసాన నోలలాడే నిపుడు
(॥ఒడఁ॥)
చెంతఁగూచుండినయాపె చేయి చాఁచకుండునా
యెంతవడిదాఁకా మాఁట లేమి చెప్పీనే
వింతదానఃగాను తన వేడుక చెల్లించితే మేలు
చింతదీర మొక్కేను చేతులెత్తి నేను
(॥ఒడఁ॥)
పాదాలుగుద్దినయాపె పక్కఁ బండకుండునా
నాదెస చూచి యెంతనవ్వు నవ్వీనే
కాదనేనా నాకుఁ దనకరుణ గలిగితే మేలు
మోదముతో నింకాను మొక్కేనేఁ దనకు
(॥ఒడఁ॥)
యేకతమాడినయాపె యెంగిలి సేయకుండునా
చేకొని కూడి నన్నెంత చెక్కునొక్కీనే
యీకడ శ్రీవేంకటేశుఁ డెంత మన్నించినా మేలు
కైకొంటి ముమ్మాటికి గక్కన మొక్కేననరే
(||pallavi||)
ŏḍam̐barasam̐ganela vŏḍivaṭṭi na nniṁtesi
vuḍivoni saṁtosāna nolalāḍe nibuḍu
(||ŏḍam̐||)
sĕṁtam̐gūsuṁḍinayābĕ seyi sām̐saguṁḍunā
yĕṁtavaḍidām̐kā mām̐ṭa lemi sĕppīne
viṁtadānaḥgānu tana veḍuga sĕlliṁchide melu
siṁtadīra mŏkkenu sedulĕtti nenu
(||ŏḍam̐||)
pādāluguddinayābĕ pakkam̐ baṁḍaguṁḍunā
nādĕsa sūsi yĕṁtanavvu navvīne
kādanenā nāgum̐ danagaruṇa galigide melu
modamudo niṁkānu mŏkkenem̐ danagu
(||ŏḍam̐||)
yegadamāḍinayābĕ yĕṁgili seyaguṁḍunā
segŏni kūḍi nannĕṁta sĕkkunŏkkīne
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕṁta manniṁchinā melu
kaigŏṁṭi mummāḍigi gakkana mŏkkenanare