ఒడఁబాటు సేసుకొమ్మీ వొప్పుగా వెనకనైనా
(॥పల్లవి॥)
ఒడఁబాటు సేసుకొమ్మీ వొప్పుగా వెనకనైనా
యెడయక వారెంత వెూహించినివారో
(॥॥)
ఇత్తల నేను నిన్ను నేకతానకుఁ దీయఁగ
చిత్తము లెట్టుండునో నీచెలులకును
బత్తిసేసి యేపొద్నూ(ద్దూ) నీపాదాలు నే నొత్తఁగాను
హత్తి వారివారియాసలవి యేమైవుండునో
(॥॥)
నెమ్మది నీమన్ననలు నేనే చేకొనఁగాను
కొమ్మలిందరూ నేమనుకొంటా నుందురో
కమ్మి నీకాఁగిలి మీఁదుకట్టుక నేనుండఁగాను
ఇమ్ములఁ దమకము లెట్టోరుచుకొందురొ
(॥॥)
శ్రీవేంకటేశుఁడ నిన్నుఁజేరి నేనే కూడఁగాను
కావిరి వారెంతవేళ గాచుకున్నారో
దేవి నలమేల్మంగను నావిన్నపమే విని
యివలఁ గూడితివి వారెంత మెచ్చుకొన్నారో
(||pallavi||)
ŏḍam̐bāḍu sesugŏmmī vŏppugā vĕnaganainā
yĕḍayaga vārĕṁta vĕూhiṁchinivāro
(||||)
ittala nenu ninnu negadānagum̐ dīyam̐ga
sittamu lĕṭṭuṁḍuno nīsĕlulagunu
battisesi yebŏdnū(ddū) nībādālu ne nŏttam̐gānu
hatti vārivāriyāsalavi yemaivuṁḍuno
(||||)
nĕmmadi nīmannanalu nene segŏnam̐gānu
kŏmmaliṁdarū nemanugŏṁṭā nuṁduro
kammi nīgām̐gili mīm̐dugaṭṭuga nenuṁḍam̐gānu
immulam̐ damagamu lĕṭṭorusugŏṁdurŏ
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍa ninnum̐jeri nene kūḍam̐gānu
kāviri vārĕṁtaveḽa gāsugunnāro
devi nalamelmaṁganu nāvinnabame vini
yivalam̐ gūḍidivi vārĕṁta mĕchchugŏnnāro