Odalu bamdla vachchu nokkavela daanigemi

ఓడలు బండ్ల వచ్చు నొక్కవేళ దానికేమి
Language

(॥పల్లవి॥)
ఓడలు బండ్ల వచ్చు నొక్కవేళ దానికేమి
కూడిన మీఁదటఁగాని కూరిమి లేదు

(॥ఓడలు॥)
నీవు విచ్చేసినదాఁకా నెలఁత ప్రియము చెప్పె
సేవలు నీవాకె కిఁకఁ జేయవలసె
తావులఁ దగులయినదాఁకానేపో యెవ్వరికి
యేవల జొరక లోఁతెఱఁగరాదు

(॥ఓడలు॥)
అంకెకు వచ్చినదాఁకా నాడినట్టె యాడెఁ జెలి
ఇంక నీవాకెకుఁ బంతమియ్యవలసె
పొంకము లట్లనేపో భూమిమీఁద నెవ్వరికి
లంకెలఁ బెనఁగ కిట్టె లావెరఁగరాదు

(॥ఓడలు॥)
ఇప్పు డింతపడి నిన్ను నింతి రతులఁ జొక్కించె
పిప్పిగా నాకెమెఇ మఱపించవలసె
యెప్పుడు శ్రీవేంకటేశ ఇంతికి నీకిదియేపో
ముప్పిరిమాటలఁగాని ముచ్చట వోదు

(||pallavi||)
oḍalu baṁḍla vachchu nŏkkaveḽa dānigemi
kūḍina mīm̐daḍam̐gāni kūrimi ledu

(||oḍalu||)
nīvu vichchesinadām̐kā nĕlam̐ta priyamu sĕppĕ
sevalu nīvāgĕ kim̐kam̐ jeyavalasĕ
tāvulam̐ dagulayinadām̐kānebo yĕvvarigi
yevala jŏraga lom̐tĕṟam̐garādu

(||oḍalu||)
aṁkĕgu vachchinadām̐kā nāḍinaṭṭĕ yāḍĕm̐ jĕli
iṁka nīvāgĕgum̐ baṁtamiyyavalasĕ
pŏṁkamu laṭlanebo bhūmimīm̐da nĕvvarigi
laṁkĕlam̐ bĕnam̐ga kiṭṭĕ lāvĕram̐garādu

(||oḍalu||)
ippu ḍiṁtabaḍi ninnu niṁti radulam̐ jŏkkiṁchĕ
pippigā nāgĕmĕi maṟabiṁchavalasĕ
yĕppuḍu śhrīveṁkaḍeśha iṁtigi nīgidiyebo
muppirimāḍalam̐gāni muchchaḍa vodu