ఓడలు బండ్ల వచ్చు నొగి బండ్లోడ లెక్కు
(॥పల్లవి॥)
ఓడలు బండ్ల వచ్చు నొగి బండ్లోడ లెక్కు
యేడా నహంకార మేల యెఱిఁగినవారికి
(॥ఓడలు॥)
సులువునఁ గొన్నాళ్లకు నరులే సుర లౌదురు
అల సురలే నరులౌదురు మీఁద
జలమయమై యుండు జగమెల్లా నొకవేళ
జలమందే భూమి పుట్టి జగము గాన్పించు
(॥ఓడలు॥)
యీరీతి నొకానొకప్పు డేనుగు దోమయై పుట్టు
ఆరయఁగా దోమ యేనుగై పుట్టును
చేరి కాలగతులను చీఁకటి వెన్నెల నొత్తు
పేరి వెన్నెల చీఁకటిఁ బెడఁబాయఁజేసును
(॥ఓడలు॥)
పరగ భాగ్యవశాన బంట్లే దొర లౌదురు
అరుదుగ దొరలే బంట్లౌదురు మీఁద
యిరవై శ్రీవేంకటేశుఁ డేలికని కొల్చితేను
పరము నిహము నొక్కపగిది కలుగును
(||pallavi||)
oḍalu baṁḍla vachchu nŏgi baṁḍloḍa lĕkku
yeḍā nahaṁkāra mela yĕṟim̐ginavārigi
(||oḍalu||)
suluvunam̐ gŏnnāḽlagu narule sura lauduru
ala surale narulauduru mīm̐da
jalamayamai yuṁḍu jagamĕllā nŏgaveḽa
jalamaṁde bhūmi puṭṭi jagamu gānpiṁchu
(||oḍalu||)
yīrīdi nŏgānŏgappu ḍenugu domayai puṭṭu
ārayam̐gā doma yenugai puṭṭunu
seri kālagadulanu sīm̐kaḍi vĕnnĕla nŏttu
peri vĕnnĕla sīm̐kaḍim̐ bĕḍam̐bāyam̐jesunu
(||oḍalu||)
paraga bhāgyavaśhāna baṁṭle dŏra lauduru
aruduga dŏrale baṁṭlauduru mīm̐da
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍeligani kŏlsidenu
paramu nihamu nŏkkabagidi kalugunu