Obuleshum deegomta noraseem gom(gom?)ta

ఓబులేశుఁ డీకొంత నొరసీఁ గొఁ(గొం?)త
Language

(॥పల్లవి॥)
ఓబులేశుఁ డీకొంత నొరసీఁ గొఁ(గొం?)త
యీ బిగువు దనకేల ఇంతెఱఁగఁడా

(॥ఓబు॥)
అదివో లకిమమ్మ ఆయపుచూపులు చిమ్మ
యెదురై నవ్వీ నితఁ డిదేమమ్మ
మది నిఁతగలవారు మారుగొండ లెక్కినారు
వదలుఁబయ్యదజారు వనితకుఁ జూడఁడా

(॥ఓబు॥)
సొమ్ములతో ఆకె వీఁగీ సొంపుఁజెమటలఁ దోఁగీ
వుమ్మలయీతఁడైతే వూర్పు రేఁగీ
యెమ్మె లింతగలవాఁడు యీడనేలున్నాఁడు ఇంతి-
తమ్మిమోముచింత వాఁడు తాఁ గానఁడా

(॥ఓబు॥)
కామినిమోహము రేఁచెఁ గాఁగిటికిఁ జెయి చాఁచె
యేమిరే యీనరసింహుఁడిందాక లాచె
ఆమని శ్రీవేంకటాద్రి నన్నినోములు నోఁచె
కామతంత్రముల నంతఘనుఁడు గాఁడా

(||pallavi||)
obuleśhum̐ ḍīgŏṁta nŏrasīm̐ gŏm̐(gŏṁ?)ta
yī biguvu danagela iṁtĕṟam̐gam̐ḍā

(||obu||)
adivo lagimamma āyabusūbulu simma
yĕdurai navvī nidam̐ ḍidemamma
madi nim̐tagalavāru mārugŏṁḍa lĕkkināru
vadalum̐bayyadajāru vanidagum̐ jūḍam̐ḍā

(||obu||)
sŏmmulado āgĕ vīm̐gī sŏṁpum̐jĕmaḍalam̐ dom̐gī
vummalayīdam̐ḍaide vūrbu rem̐gī
yĕmmĕ liṁtagalavām̐ḍu yīḍanelunnām̐ḍu iṁti-
tammimomusiṁta vām̐ḍu tām̐ gānam̐ḍā

(||obu||)
kāminimohamu rem̐sĕm̐ gām̐giḍigim̐ jĕyi sām̐sĕ
yemire yīnarasiṁhum̐ḍiṁdāga lāsĕ
āmani śhrīveṁkaḍādri nanninomulu nom̐sĕ
kāmadaṁtramula naṁtaghanum̐ḍu gām̐ḍā