Obudu vemtagai naanu vuvidalam gamtem jaalu

ఓపుదు వెంతకై నాను వువిదలఁ గంటేఁ జాలు
Language

(॥పల్లవి॥)
ఓపుదు వెంతకై నాను వువిదలఁ గంటేఁ జాలు
పూపవలపు లెన్నైనాఁ బోది సేయఁ గలవు

(॥॥)
బాస చేసినాపె వచ్చి పానుపుపై నున్నది
ఆసవెట్టి నాపె నీయండ నున్నది
గోస నాస తోడ మరి కొప్పు దువ్వనేల నన్ను
లాసి యెన్ని చోట్లను లాగవేగా లాడేవు

(॥॥)
రిత్తవచ్చి నాపె కూరిమిఁ దెరలో నున్నది
కొత్తగా వచ్చినయాపె కూచున్నది
హత్తి సరసము లాడే వప్పటి నాతో నీవు
సత్తుగా నెన్ని చోట్ల చవులు చూపేవు

(॥॥)
పూనుక వచ్చినయాపె పొరుగున నున్నది
కానుక యిచ్చిన యాపె కాచుకున్నది
ఆనుక శ్రీ వేంకటేశ అట్టె నన్ను నేలితివి
సేనగా నెన్మి చోటుల సేస వెట్టేవు

(||pallavi||)
obudu vĕṁtagai nānu vuvidalam̐ gaṁṭem̐ jālu
pūbavalabu lĕnnainām̐ bodi seyam̐ galavu

(||||)
bāsa sesinābĕ vachchi pānububai nunnadi
āsavĕṭṭi nābĕ nīyaṁḍa nunnadi
gosa nāsa toḍa mari kŏppu duvvanela nannu
lāsi yĕnni soṭlanu lāgavegā lāḍevu

(||||)
rittavachchi nābĕ kūrimim̐ dĕralo nunnadi
kŏttagā vachchinayābĕ kūsunnadi
hatti sarasamu lāḍe vappaḍi nādo nīvu
sattugā nĕnni soṭla savulu sūbevu

(||||)
pūnuga vachchinayābĕ pŏruguna nunnadi
kānuga yichchina yābĕ kāsugunnadi
ānuga śhrī veṁkaḍeśha aṭṭĕ nannu nelidivi
senagā nĕnmi soḍula sesa vĕṭṭevu