Obo idemti navvu looragumdave

ఓపో ఇదేఁటి నవ్వు లూరకుండవే
Language

(॥పల్లవి॥)
ఓపో ఇదేఁటి నవ్వు లూరకుండవే
నా పలుకు వింటి విఁక నవ్వులేకావా

(॥ఓపో॥)
యేమే వచ్చితివి నీవెన్నఁడు లేమివో
కామిని నీరమణుఁ డీకడ కంపెనే
యేమి పనిగలిగె నేఁడేఁటి కొత్తలే
ఆ మాఁటకే పో నన్నడుగనేలే

(॥ఓపో॥)
మగిడి యాసద్దులేల మరిమాఁ టేలే వో
మగువ నీవిభుఁడు రమ్మనుమనెనె
యెగసక్కెములు నాతో వినియుఁ గొన్నా యేమో
నిగిడి యాతనిగుట్టు నీవెఱఁగనా వా

(॥ఓపో॥)
తనిసితి నింక తడవకువే నీ
వెనకనె వాఁడె శ్రీవేంకటేశుఁడు
అననేమున్నది నిన్ను నాయఁబదవే మీ
మనసు లెనసె నింకా మఱఁగేఁటికే

(||pallavi||)
obo idem̐ṭi navvu lūraguṁḍave
nā palugu viṁṭi vim̐ka navvulegāvā

(||obo||)
yeme vachchidivi nīvĕnnam̐ḍu lemivo
kāmini nīramaṇum̐ ḍīgaḍa kaṁpĕne
yemi panigaligĕ nem̐ḍem̐ṭi kŏttale
ā mām̐ṭage po nannaḍuganele

(||obo||)
magiḍi yāsaddulela marimām̐ ṭele vo
maguva nīvibhum̐ḍu rammanumanĕnĕ
yĕgasakkĕmulu nādo viniyum̐ gŏnnā yemo
nigiḍi yādaniguṭṭu nīvĕṟam̐ganā vā

(||obo||)
tanisidi niṁka taḍavaguve nī
vĕnaganĕ vām̐ḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
ananemunnadi ninnu nāyam̐badave mī
manasu lĕnasĕ niṁkā maṟam̐gem̐ṭige