ఓపినంత తొల్లె వింటి నూరిలోన నీ సుద్దులు
(॥పల్లవి॥)
ఓపినంత తొల్లె వింటి నూరిలోన నీ సుద్దులు
నీపాటివారమా నెలఁతల మిపుడు
(॥॥)
చెలరేఁగి చెలరేఁగి చెప్పేవు మాటలు
కొలఁది వెట్టరావు వూఁకొనే నంటేను
బలిమికాఁడవు తొల్లె పదారువేలసతుల-
వలపెల్లాఁ జెప్పేనంటే వసమా వినఁగను
(॥॥)
సారెసారె నాముందరఁ జదివేవు నీతులు
మేర మితి లేదు నిన్ను మెచ్చేనంటేను
ఆరితేరినవాఁడవు అట్టె గొల్లెతలకథా-
భారతము చెప్పఁగానే భట్టనా పొగడను
(॥॥)
కొసరి కొసరి నన్నుఁ గూడేవు శ్రీవేంకటేశ
సరసమా నీనేరుపు చూచేనంటేను
అసమానుఁడవు నీవు అష్టమహిషల రతి-
పస లెంచితే మనసు పట్టునా సంతోసము
(||pallavi||)
obinaṁta tŏllĕ viṁṭi nūrilona nī suddulu
nībāḍivāramā nĕlam̐tala mibuḍu
(||||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕppevu māḍalu
kŏlam̐di vĕṭṭarāvu vūm̐kŏne naṁṭenu
balimigām̐ḍavu tŏllĕ padāruvelasadula-
valabĕllām̐ jĕppenaṁṭe vasamā vinam̐ganu
(||||)
sārĕsārĕ nāmuṁdaram̐ jadivevu nīdulu
mera midi ledu ninnu mĕchchenaṁṭenu
āriderinavām̐ḍavu aṭṭĕ gŏllĕdalagathā-
bhāradamu sĕppam̐gāne bhaṭṭanā pŏgaḍanu
(||||)
kŏsari kŏsari nannum̐ gūḍevu śhrīveṁkaḍeśha
sarasamā nīnerubu sūsenaṁṭenu
asamānum̐ḍavu nīvu aṣhṭamahiṣhala radi-
pasa lĕṁchide manasu paṭṭunā saṁtosamu