Obigagalavaarigi vodi numdu navi remdu

ఓపికగలవారికి వొడి నుండు నవి రెండు
Language

(॥పల్లవి॥)
ఓపికగలవారికి వొడి నుండు నవి రెండు
పై పైఁ జేకొనేటివారి భాగ్యము కొలఁదులు

(॥ఓపిక॥)
సేసినంతపుణ్యము సృష్టిలోనివారి కెల్ల
ఆసల బహుఫలము హరిదాస్యము
త్రాసువంటిది కర్మము దైవముపై భక్తియైతే
బాస దప్పక పండినపంటవంటిది

(॥ఓపిక॥)
గడించినంతే ధనము కైకొనేటివారికెల్ల
అడరి విజ్ఞానధన మక్షయం
సుడివంటిది సంపద చుట్లఁ బెట్టుచునుండు
అడఁచి నిరాశ బ్రహ్మనందమువంటిది

(॥ఓపిక॥)
ధర నాడినంతే వట తగు నక్షరజ్ఞులకు
హరినామోచ్చారణ మక్షయం
యిరవై శ్రీ వేంకటేశుఁ డిందుల కధిదేవత
నిరతి నితనికృప నిధానమువంటిది

(||pallavi||)
obigagalavārigi vŏḍi nuṁḍu navi rĕṁḍu
pai paim̐ jegŏneḍivāri bhāgyamu kŏlam̐dulu

(||obiga||)
sesinaṁtabuṇyamu sṛṣhṭilonivāri kĕlla
āsala bahuphalamu haridāsyamu
trāsuvaṁṭidi karmamu daivamubai bhaktiyaide
bāsa dappaga paṁḍinabaṁṭavaṁṭidi

(||obiga||)
gaḍiṁchinaṁte dhanamu kaigŏneḍivārigĕlla
aḍari vijñānadhana makṣhayaṁ
suḍivaṁṭidi saṁpada suṭlam̐ bĕṭṭusunuṁḍu
aḍam̐si nirāśha brahmanaṁdamuvaṁṭidi

(||obiga||)
dhara nāḍinaṁte vaḍa tagu nakṣharajñulagu
harināmochchāraṇa makṣhayaṁ
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍiṁdula kadhidevada
niradi nidanikṛpa nidhānamuvaṁṭidi