Obidem ganaga neevu vodigattu mimdugunu

ఓపితేఁ గనక నీవు వొడిగట్టు మిందుకును
Language

(॥పల్లవి॥)
ఓపితేఁ గనక నీవు వొడిగట్టు మిందుకును
కోపము పనికిరాదు కొమ్మల యెడలను

(॥ఓపి॥)
వలపు జున్నువంటిది వడి రేఁచఁబోతేను
తిలకించ మోవినే తేనె గారును
తలఁపు తీగెవంటిది దగ్గరి పొందుసేసితే
పులకలమొగ్గులు గొబ్బున మేనఁ బొడము

(॥ఓపి॥)
ననుపు వెన్నవంటిది నవ్వులు నవ్వితేనే
మొనసి సెలవి నయములు దేరును
చనవు పంటవంటిది జాణతనాలాడఁగానే
అనుగునాలికెతుద నక్షయమై పెరుగు

(॥ఓపి॥)
రతి తపమువంటిది రచనలు మీఱఁగాను
చతురతఁ గాఁగిటిలో సఫలమౌను
హితవుతో శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
మితిమీఱి యిందులోనె మేలెల్లాఁ జేరును

(||pallavi||)
obidem̐ ganaga nīvu vŏḍigaṭṭu miṁdugunu
kobamu panigirādu kŏmmala yĕḍalanu

(||obi||)
valabu junnuvaṁṭidi vaḍi rem̐sam̐bodenu
tilagiṁcha movine tenĕ gārunu
talam̐pu tīgĕvaṁṭidi daggari pŏṁduseside
pulagalamŏggulu gŏbbuna menam̐ bŏḍamu

(||obi||)
nanubu vĕnnavaṁṭidi navvulu navvidene
mŏnasi sĕlavi nayamulu derunu
sanavu paṁṭavaṁṭidi jāṇadanālāḍam̐gāne
anugunāligĕduda nakṣhayamai pĕrugu

(||obi||)
radi tabamuvaṁṭidi rasanalu mīṟam̐gānu
saduradam̐ gām̐giḍilo saphalamaunu
hidavudo śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
midimīṟi yiṁdulonĕ melĕllām̐ jerunu