ఓపితే నీచిత్తము నేనున్నట్టె విన్నవించితి
(॥పల్లవి॥)
ఓపితే నీచిత్తము నేనున్నట్టె విన్నవించితి
చేపట్టి యేలుము నీసేవ సేసేదానను
(॥ఓప॥)
జవళినాగుబ్బలకుఁ జాఁచేవు చేతులు
నవకా లింతేకాని నాననిగట్లు
కవగొని పిసికితేఁ గరఁగ వెంతైనాను
తవిలి పెనఁగితే మీఁదఁ బెచ్చువెరుగును
(॥ఓప॥)
చుట్టిచుట్టి పిఱుఁ దేమిచూచేవు నీకన్నులను
పట్టవసగావు పెద్దబండికండ్లు
వొట్టి పైకి దీసుకొంటే నుంగిటితోఁ గళదాఁకు
వట్టిమాఁకు లిగిరించేవలపులుచేఁగలు
(॥ఓప॥)
యెఱిఁగెఱిఁగి నామోవి కేఁటికి నొరూరేవు
మఱఁగేల కొమరాఁక మానిపండు
గుఱిగా శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు
తఱి తీపులెల్లా నిందు దాఁచుకొనేనెలవు
(||pallavi||)
obide nīsittamu nenunnaṭṭĕ vinnaviṁchidi
sebaṭṭi yelumu nīseva sesedānanu
(||oba||)
javaḽināgubbalagum̐ jām̐sevu sedulu
navagā liṁtegāni nānanigaṭlu
kavagŏni pisigidem̐ garam̐ga vĕṁtainānu
tavili pĕnam̐gide mīm̐dam̐ bĕchchuvĕrugunu
(||oba||)
suṭṭisuṭṭi piṟum̐ demisūsevu nīgannulanu
paṭṭavasagāvu pĕddabaṁḍigaṁḍlu
vŏṭṭi paigi dīsugŏṁṭe nuṁgiḍidom̐ gaḽadām̐ku
vaṭṭimām̐ku ligiriṁchevalabulusem̐galu
(||oba||)
yĕṟim̐gĕṟim̐gi nāmovi kem̐ṭigi nŏrūrevu
maṟam̐gela kŏmarām̐ka mānibaṁḍu
guṟigā śhrīveṁkaḍeśha kūḍidivi nannu nem̐ḍu
taṟi tībulĕllā niṁdu dām̐sugŏnenĕlavu