Obanoba tiyyagure vodivatti rammamtaa

ఓపనోప తియ్యకురే వొడివట్టి రమ్మంటా
Language

(॥పల్లవి॥)
ఓపనోప తియ్యకురే వొడివట్టి రమ్మంటా
యీ పొద్దు కాతని వద్దికేఁగరే మీరు

(॥॥)
ఔలేవే తనసుద్ద లందరుఁ దెలిసేరా
తేలింపుసటలు నాకే తెలుఁసుఁగాక
వోలి సూడుబంటౌట వొండెఁ జుట్ట మవుట గాక
మైల గొంత అందులో మణుఁగూఁ గొంతా

(॥॥)
వింటిలేవే వానికిఁగా వేఁడుకొనే మీ మాఁట
రెంటికిఁ గలఁడు తనరీ తెరుఁగుదు
ఇంట నుండవలె నొండె యీడకే రావలె నొండె
కుంటెనలు గొంత మరి కూటములు గొంతా

(॥॥)
అట్టేకాదా మీకుఁ దెల్లనైనవెల్లాఁ బాలవును
గట్టిగఁ దనగుణాలు కన్నవే నేను
యెట్టకేలకు శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
తిట్టు గొంతా ఇందాఁక దీవె నిఁకఁ గొంతా

(||pallavi||)
obanoba tiyyagure vŏḍivaṭṭi rammaṁṭā
yī pŏddu kādani vaddigem̐gare mīru

(||||)
auleve tanasudda laṁdarum̐ dĕliserā
teliṁpusaḍalu nāge tĕlum̐sum̐gāga
voli sūḍubaṁṭauḍa vŏṁḍĕm̐ juṭṭa mavuḍa gāga
maila gŏṁta aṁdulo maṇum̐gūm̐ gŏṁtā

(||||)
viṁṭileve vānigim̐gā vem̐ḍugŏne mī mām̐ṭa
rĕṁṭigim̐ galam̐ḍu tanarī tĕrum̐gudu
iṁṭa nuṁḍavalĕ nŏṁḍĕ yīḍage rāvalĕ nŏṁḍĕ
kuṁṭĕnalu gŏṁta mari kūḍamulu gŏṁtā

(||||)
aṭṭegādā mīgum̐ dĕllanainavĕllām̐ bālavunu
gaṭṭigam̐ danaguṇālu kannave nenu
yĕṭṭagelagu śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
tiṭṭu gŏṁtā iṁdām̐ka dīvĕ nim̐kam̐ gŏṁtā