Obanoba nimdugellaa vo selulaala

ఓపనోప నిందుకెల్లా వో చెలులాల
Language

(॥పల్లవి॥)
ఓపనోప నిందుకెల్లా వో చెలులాల
యే పనులకని పైపై నెచ్చరించే నతని

(॥ఓప॥)
కన్నులు చల్లంగాఁ జూచి కడుసంతసించేఁగాక
యెన్నిటికని కోపించే నిఁక నాతని
చన్నులమొనల నొత్తి సారెఁ గాంగిలించేంగాక
కన్నుందుకెలా నెట్లఁ గక్కసించే నాతిన

(॥ఓప॥)
చేతులు నిండా నేను సేవసేసేఁగాక మరి
యేతుల నెట్టు జంకించే నిఁక నాతని
ఆతుమార మోవితేనె లట్టే విందువెట్టేఁగాక
జాతినీతిమాని యెట్టు సాదించే నతని

(॥ఓప॥)
కాయము నిండాఁ బొంది కరఁగించి కూడేఁగాక
యేయుపాయముల మీరే నిఁక నాతని
యీయెడ శ్రీవేంకటేశుఁ డెనసి నన్ను మన్నించె
చాయల సన్నల నేమి జగుసేసే నాతని

(||pallavi||)
obanoba niṁdugĕllā vo sĕlulāla
ye panulagani paibai nĕchchariṁche nadani

(||oba||)
kannulu sallaṁgām̐ jūsi kaḍusaṁtasiṁchem̐gāga
yĕnniḍigani kobiṁche nim̐ka nādani
sannulamŏnala nŏtti sārĕm̐ gāṁgiliṁcheṁgāga
kannuṁdugĕlā nĕṭlam̐ gakkasiṁche nādina

(||oba||)
sedulu niṁḍā nenu sevasesem̐gāga mari
yedula nĕṭṭu jaṁkiṁche nim̐ka nādani
ādumāra movidenĕ laṭṭe viṁduvĕṭṭem̐gāga
jādinīdimāni yĕṭṭu sādiṁche nadani

(||oba||)
kāyamu niṁḍām̐ bŏṁdi karam̐giṁchi kūḍem̐gāga
yeyubāyamula mīre nim̐ka nādani
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnasi nannu manniṁchĕ
sāyala sannala nemi jagusese nādani