(॥పల్లవి॥)
ఓపనయ్య వోపనయ్య
ఓపనయ్య యీ యొప్పులే తప్పులు
(॥ఓప॥)
ఎక్కడికి నెక్కడ - యెక్కువే యెరవు
తక్కులే యీ మొక్కులు - తక్కువే దారణ
(॥ఒప॥)
ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు
తవ్వలే యీరవ్వలు - చివ్వలే సిగ్గులు
(॥ఓప॥)
బొంకులే పొందులు - కింకలే గిరులు
వేంకటవిభుఁడ నీ - జంకెలే జంపులు
(||pallavi||)
obanayya vobanayya
obanayya yī yŏppule tappulu
(||oba||)
ĕkkaḍigi nĕkkaḍa - yĕkkuve yĕravu
takkule yī mŏkkulu - takkuve dāraṇa
(||ŏba||)
ĕvvarigi nĕvvaro navvule nŏvvulu
tavvale yīravvalu - sivvale siggulu
(||oba||)
bŏṁkule pŏṁdulu - kiṁkale girulu
veṁkaḍavibhum̐ḍa nī - jaṁkĕle jaṁpulu