Obanayya vobanayya

ఓపనయ్య వోపనయ్య
Language

(॥పల్లవి॥)
ఓపనయ్య వోపనయ్య
వోపనయ్య యీ వొప్పులే తప్పులు

(॥ఓప॥)
ఎక్కడికి నెక్కడ యెక్కువే యెరవు
తక్కులే యీ మొక్కులు తక్కువే దారణ

(॥ఓప॥)
ఎవ్వరికి నెవ్వరో నవ్వులే నొవ్వులు
తప్పులే యీ రవ్వలు చివ్వలే సిగ్గులు

(॥ఓప॥)
బొంకులే పొందులు కింకలే గిరులు
వేంకటవిభుఁడ నీజంకెలే జంపులు

(||pallavi||)
obanayya vobanayya
vobanayya yī vŏppule tappulu

(||oba||)
ĕkkaḍigi nĕkkaḍa yĕkkuve yĕravu
takkule yī mŏkkulu takkuve dāraṇa

(||oba||)
ĕvvarigi nĕvvaro navvule nŏvvulu
tappule yī ravvalu sivvale siggulu

(||oba||)
bŏṁkule pŏṁdulu kiṁkale girulu
veṁkaḍavibhum̐ḍa nījaṁkĕle jaṁpulu