Obanannavaarinela vodivattevu neebai

ఓపనన్నవారినేల వొడివట్టేవు నీపై
Language

(॥పల్లవి॥)
ఓపనన్నవారినేల వొడివట్టేవు నీపై
చూపు నాటించినవారిఁ జూడరాదా

(॥ఓప॥)
తలవంచుకుండఁగాను తగ పంతమియ్యఁగాను
వొలిసి నన్నేల నీవు నొడివట్టేవు
చెలఁగి నీమేననున్నచేఁత సేసియాపెతో
సొలసి నీబలిమెల్లాఁ జూపరాదా

(॥ఓప॥)
చెక్కుచేత నుండఁగాను చేరి నీకు మొక్కుఁగాను
వొక్కటొక్కటాడి యేల వొడివట్టేవు
నిక్కి నిక్కి తామెరల నిన్ను వేసినవారితో
పెక్కుచందముల నీవు పెనఁగరాదా

(॥ఓప॥)
వొద్ద గాచుకుండఁగాను వూడిగాలు సేయఁగాను
వుద్దండానఁ గూడి యేల వొడివట్టేవు
చద్దికిని వేఁడికిని జమళినుండినవారి
అద్దుక శ్రీవేంకటేశ అలమరాదా

(||pallavi||)
obanannavārinela vŏḍivaṭṭevu nībai
sūbu nāḍiṁchinavārim̐ jūḍarādā

(||oba||)
talavaṁchuguṁḍam̐gānu taga paṁtamiyyam̐gānu
vŏlisi nannela nīvu nŏḍivaṭṭevu
sĕlam̐gi nīmenanunnasem̐ta sesiyābĕdo
sŏlasi nībalimĕllām̐ jūbarādā

(||oba||)
sĕkkuseda nuṁḍam̐gānu seri nīgu mŏkkum̐gānu
vŏkkaḍŏkkaḍāḍi yela vŏḍivaṭṭevu
nikki nikki tāmĕrala ninnu vesinavārido
pĕkkusaṁdamula nīvu pĕnam̐garādā

(||oba||)
vŏdda gāsuguṁḍam̐gānu vūḍigālu seyam̐gānu
vuddaṁḍānam̐ gūḍi yela vŏḍivaṭṭevu
saddigini vem̐ḍigini jamaḽinuṁḍinavāri
adduga śhrīveṁkaḍeśha alamarādā