Obananna vidavavu voomkonumanevu neevu

ఓపనన్న విడవవు వూఁకొనుమనేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఓపనన్న విడవవు వూఁకొనుమనేవు నీవు
నీ పను లివెల్లాను నిన్ననె పో వింటిని

(॥ఓప॥)
మాను మన్న మానవు మా తొనె నీ సుద్దు లెల్లఁ
దేనె పూసి చెప్పి చెప్పి తేలించేవూ
కాని కాని అందు కేమి కల్ల లాడేవాఁడవా
నే నెరుఁగుదు నంతాను నిన్ననె పో వింటివి

(॥ఓప॥)
వద్దన్నా విడువవు వాకిటఁ గూచుండీ నీ
పెద్దరికే లెల్ల నాతో పెంచి చెప్పేవు
కద్దు గద్దు నీవల్ల కడము లేమి లేవు
నిద్దరించు నీ గుణము నిన్ననె పోవింటిని

(॥ఓప॥)
సిగ్గు వడ్డాఁ బో నీవు చేయ వట్టుకొని నాతో
అగ్గలపుఁ బచ్చిమాట లవి చెప్పేవు
దగ్గరి శ్రీవెంకటేశ తగు నన్నుఁ గూడితివి
నిగ్గుల నీ కత లెల్ల నిన్ననేపొ వింటని

(||pallavi||)
obananna viḍavavu vūm̐kŏnumanevu nīvu
nī panu livĕllānu ninnanĕ po viṁṭini

(||oba||)
mānu manna mānavu mā tŏnĕ nī suddu lĕllam̐
denĕ pūsi sĕppi sĕppi teliṁchevū
kāni kāni aṁdu kemi kalla lāḍevām̐ḍavā
ne nĕrum̐gudu naṁtānu ninnanĕ po viṁṭivi

(||oba||)
vaddannā viḍuvavu vāgiḍam̐ gūsuṁḍī nī
pĕddarige lĕlla nādo pĕṁchi sĕppevu
kaddu gaddu nīvalla kaḍamu lemi levu
niddariṁchu nī guṇamu ninnanĕ poviṁṭini

(||oba||)
siggu vaḍḍām̐ bo nīvu seya vaṭṭugŏni nādo
aggalabum̐ bachchimāḍa lavi sĕppevu
daggari śhrīvĕṁkaḍeśha tagu nannum̐ gūḍidivi
niggula nī kada lĕlla ninnanebŏ viṁṭani