ఓపననఁగానే పో వొళ్లు వేసీని
(॥పల్లవి॥)
ఓపననఁగానే పో వొళ్లు వేసీని
తీపుల జంకించి నాపైఁ దేనె చల్లీని
(॥ఓప॥)
మాటలాడెఁబో తాను మరి నే నూఁకొంటినా
కూటమి నిందులకే తాఁ గొంగువట్టీని
నీటున సన్నసేసెఁబో నిక్కి నేఁ జూచితినా
తాటల నిందులకే తాఁ దగులనాడీని
(॥ఓప॥)
సరుసఁ దా నవ్వెఁబో నే జాణతనాలాడితినా
అరుదై యిందులకే నన్నంటవచ్చీని
అరసి తా మొక్కెఁబో నే నామొక్కు గైకొంటినా
సిరుల నందులకే తా సేసవెట్టీని
(॥ఓప॥)
చేయివట్టి తీసెఁబో నే సిగ్గువడి రాకుంటినా
బాయట నందులకే తాఁ బచ్చి సేసీని
వోయమ్మ శ్రీవేంకటేశుఁ డోఁగునూఁతులాడ నన్ను
చాయలకే కూడెఁబో వేసాలు సేసీని
(||pallavi||)
obananam̐gāne po vŏḽlu vesīni
tībula jaṁkiṁchi nābaim̐ denĕ sallīni
(||oba||)
māḍalāḍĕm̐bo tānu mari ne nūm̐kŏṁṭinā
kūḍami niṁdulage tām̐ gŏṁguvaṭṭīni
nīḍuna sannasesĕm̐bo nikki nem̐ jūsidinā
tāḍala niṁdulage tām̐ dagulanāḍīni
(||oba||)
sarusam̐ dā navvĕm̐bo ne jāṇadanālāḍidinā
arudai yiṁdulage nannaṁṭavachchīni
arasi tā mŏkkĕm̐bo ne nāmŏkku gaigŏṁṭinā
sirula naṁdulage tā sesavĕṭṭīni
(||oba||)
seyivaṭṭi tīsĕm̐bo ne sigguvaḍi rāguṁṭinā
bāyaḍa naṁdulage tām̐ bachchi sesīni
voyamma śhrīveṁkaḍeśhum̐ ḍom̐gunūm̐tulāḍa nannu
sāyalage kūḍĕm̐bo vesālu sesīni