ఓపము నీతోఁ బెనఁగ వోబుళేశుఁడ
(॥పల్లవి॥)
ఓపము నీతోఁ బెనఁగ వోబుళేశుఁడ
ఆపని నేనెఱుఁగనా అయ్యో వోబుళేశుఁడా
(॥ఓపము॥)
చేయి నీవు ముట్టఁగాను సెలవినవ్వులు ముంచె
వోయయ్య తలవయ్యా వోబుళేశుఁడా
నీ యిచ్చలోన మెలఁగ నే మంత నేరుతుమా
ఆయము లంట వచ్చేవు అట్టే వోబుళేశుఁడా
(॥ఓపము॥)
కోరి పువ్వుల వేయఁగ కొప్పు కడు వెడ జారె
వూరకుండు చాలు నోయి వోబుళేశుఁడా
సారె నిన్ను మచ్చరాన జరయఁగఁ బాలము
వోరచూపులఁ జూడకు వోబుళేశుఁడా
(॥ఓపము॥)
గద్దించి నీవు కూడఁగ కాయ మెల్లాఁ బులకించె
వొద్దఁ బాయకుండవయ్య వోబుళేశుఁడా
అద్దొ శ్రీవేంకటాద్రి నహెబలమునందు
తిద్దితివి నన్నునే రతికి వోబుళేశుఁడా
(||pallavi||)
obamu nīdom̐ bĕnam̐ga vobuḽeśhum̐ḍa
ābani nenĕṟum̐ganā ayyo vobuḽeśhum̐ḍā
(||obamu||)
seyi nīvu muṭṭam̐gānu sĕlavinavvulu muṁchĕ
voyayya talavayyā vobuḽeśhum̐ḍā
nī yichchalona mĕlam̐ga ne maṁta nerudumā
āyamu laṁṭa vachchevu aṭṭe vobuḽeśhum̐ḍā
(||obamu||)
kori puvvula veyam̐ga kŏppu kaḍu vĕḍa jārĕ
vūraguṁḍu sālu noyi vobuḽeśhum̐ḍā
sārĕ ninnu machcharāna jarayam̐gam̐ bālamu
vorasūbulam̐ jūḍagu vobuḽeśhum̐ḍā
(||obamu||)
gaddiṁchi nīvu kūḍam̐ga kāya mĕllām̐ bulagiṁchĕ
vŏddam̐ bāyaguṁḍavayya vobuḽeśhum̐ḍā
addŏ śhrīveṁkaḍādri nahĕbalamunaṁdu
tiddidivi nannune radigi vobuḽeśhum̐ḍā