ఓపమే చాలును యింత కోపమే నేము
(॥పల్లవి॥)
ఓపమే చాలును యింత కోపమే నేము
చేపట్టి యిద్దరి సరిసేసీ దాను
(॥ఓప॥)
పడఁతిపైకోపాన పతి నేమైనా నందు
అడరి నిష్ఠూరిఁ జేయకురే నన్ను
ముడికాఁ డిద్దరిమీఁద మొకమోటమే తనకు
అడఁచీనా యిద్దరివా దాడకేలే నేను
(॥ఓప॥)
పట్టకురే నన్ను మీరు పలుమారు రమ్మనుచు
అట్టె సవతివద్ద నాతఁ డున్నాఁడు
ఇట్టె కల్లఁగకలిగితే యెవ్వరిఁ గోపించలేడు
అట్టిట్టు విభుని కెదురాడఁ దతి గాదు
(॥ఓప॥)
అంత గలితే మీరు ఆకెను రాకుండఁజేసి
చెంతలఁ దోడుకరారే శ్రీ వేంకటేశు
యితలో నా ఇంట నుండె యీతఁడిదెనన్నుఁగూడె
వింతసతులఁ గుంటేను వేసటయ్యీ నాకు
(||pallavi||)
obame sālunu yiṁta kobame nemu
sebaṭṭi yiddari sarisesī dānu
(||oba||)
paḍam̐tibaigobāna padi nemainā naṁdu
aḍari niṣhṭhūrim̐ jeyagure nannu
muḍigām̐ ḍiddarimīm̐da mŏgamoḍame tanagu
aḍam̐sīnā yiddarivā dāḍagele nenu
(||oba||)
paṭṭagure nannu mīru palumāru rammanusu
aṭṭĕ savadivadda nādam̐ ḍunnām̐ḍu
iṭṭĕ kallam̐gagaligide yĕvvarim̐ gobiṁchaleḍu
aṭṭiṭṭu vibhuni kĕdurāḍam̐ dadi gādu
(||oba||)
aṁta galide mīru āgĕnu rāguṁḍam̐jesi
sĕṁtalam̐ doḍugarāre śhrī veṁkaḍeśhu
yidalo nā iṁṭa nuṁḍĕ yīdam̐ḍidĕnannum̐gūḍĕ
viṁtasadulam̐ guṁṭenu vesaḍayyī nāgu