ఓపమయ్యా నే మింతేసి; వూడిగాలు సేసేఁగాని
(॥పల్లవి॥)
ఓపమయ్యా నే మింతేసి; వూడిగాలు సేసేఁగాని
యేపునఁ గొసరఁబోతే నెమ్మె సేసె నందువు
(॥ఓప॥)
పెనఁగులాడు మనుచుఁ బ్రియపడే వట్లైతే
చెనకి చన్నులు దాఁకించితి నందువు
ననుపు చేసుక నీతో నవ్వుమనే వట్లైతే
మనసునఁ జొక్కేవా మందెమేళ మందువు
(॥ఓప॥)
వొద్దఁ గూచుండు మనేవు వూరకే నన్నట్లైతే
నిద్దుర వోనియ్యనంటా నేర మెంతువు
పెద్దగాఁగఁ గొప్పు నీకుఁ బెట్టు మనే వట్లైతే
వుద్దండానఁ గొనగోర నూఁదితి నే నందువు
(॥ఓప॥)
తొప్పఁదోఁగ గంద మలదు మనేవు అట్లైతే
చిప్పిలు నీమేను సోదించితి నందువు
యిప్పుడె నన్ను శ్రీవేంకటేశ యేలితివి నేఁడు
కప్పు మనేవు పయ్యద గయ్యాళి నందువు
(||pallavi||)
obamayyā ne miṁtesi; vūḍigālu sesem̐gāni
yebunam̐ gŏsaram̐bode nĕmmĕ sesĕ naṁduvu
(||oba||)
pĕnam̐gulāḍu manusum̐ briyabaḍe vaṭlaide
sĕnagi sannulu dām̐kiṁchidi naṁduvu
nanubu sesuga nīdo navvumane vaṭlaide
manasunam̐ jŏkkevā maṁdĕmeḽa maṁduvu
(||oba||)
vŏddam̐ gūsuṁḍu manevu vūrage nannaṭlaide
niddura voniyyanaṁṭā nera mĕṁtuvu
pĕddagām̐gam̐ gŏppu nīgum̐ bĕṭṭu mane vaṭlaide
vuddaṁḍānam̐ gŏnagora nūm̐didi ne naṁduvu
(||oba||)
tŏppam̐dom̐ga gaṁda maladu manevu aṭlaide
sippilu nīmenu sodiṁchidi naṁduvu
yippuḍĕ nannu śhrīveṁkaḍeśha yelidivi nem̐ḍu
kappu manevu payyada gayyāḽi naṁduvu