Obamayya ne mamtesi vummadigoluvulagu

ఓపమయ్య నే మంతేసి వుమ్మడికొలువులకు
Language

(॥పల్లవి॥)
ఓపమయ్య నే మంతేసి వుమ్మడికొలువులకు
చేపట్టి నీవేలితేను సేవచేసేఁ గాని

(॥ఓప॥)
నీవునాపెఁ గూచుండఁగా నేనీకు మొక్కితేను
భావించ సగ మాపెకుఁ బాలురాదా
యీవలను వేరొకతె ఇంట నిన్నుఁ బొడగంటే
తావుల నేంపెకుఁ బెద్దరికము రాదా

(॥ఓప॥)
పొత్తుల నాపె వుండఁగా బువ్వము నేఁ దొడికితే
హత్తిననగమెంగిలి ఆపెది గాదా
బత్తితోడ నే నీకు పచ్చడము గప్పితేను
తత్తరించి ఇందు కాపె తనలోలో నవ్వదా

(॥ఓప॥)
తమ్ముల మాపె కిడఁగా తరవాత నేఁ గై కొంటే
ఇమ్ముల ముందువెనక లిందునే కాదా
నెమ్మది శ్రీవేంకటేశ నీవె కూడితి విద్దరి
కమ్మిరనమారతులెల్లాఁ గలగఁప గాదా

(||pallavi||)
obamayya ne maṁtesi vummaḍigŏluvulagu
sebaṭṭi nīvelidenu sevasesem̐ gāni

(||oba||)
nīvunābĕm̐ gūsuṁḍam̐gā nenīgu mŏkkidenu
bhāviṁcha saga mābĕgum̐ bālurādā
yīvalanu verŏgadĕ iṁṭa ninnum̐ bŏḍagaṁṭe
tāvula neṁpĕgum̐ bĕddarigamu rādā

(||oba||)
pŏttula nābĕ vuṁḍam̐gā buvvamu nem̐ dŏḍigide
hattinanagamĕṁgili ābĕdi gādā
battidoḍa ne nīgu pachchaḍamu gappidenu
tattariṁchi iṁdu kābĕ tanalolo navvadā

(||oba||)
tammula mābĕ kiḍam̐gā taravāda nem̐ gai kŏṁṭe
immula muṁduvĕnaga liṁdune kādā
nĕmmadi śhrīveṁkaḍeśha nīvĕ kūḍidi viddari
kammiranamāradulĕllām̐ galagam̐pa gādā