ఓ యమ్మ యశోద వొద్దన్న మానఁడు
(॥పల్లవి॥)
ఓ యమ్మ యశోద వొద్దన్న మానఁడు
ఖోయని యారిచీ గోవిందుఁడు
(॥ఓయ॥)
పయ్యెద లెడలఁ బట్టెరు గొల్లెత
లొయ్యన తాఁ గొట్టీ నుట్లు
తియ్యనిపెరుగు తేనె వారవట్టీ
కూయఁగఁ గూయఁగ గోవిందుఁడు
(॥ఓయ॥)
చాడెలు దియ్యుచు సతులు నవ్వఁగ
ఆడవారిచన్ను లట్టె తీసీ
యేడకైన చాఁచీ లెత్తిన కోలలు
కోడెకాఁడు గదె గోవిందుఁడు
(॥ఓయ॥)
యెమ్మెలు నెరపీ యిందిరయుఁ దాను
అమ్మరో శ్రీ వేంకటాద్రి వీథులను
కమ్మి గోపికలు కాఁగిటఁ గూడఁగ
కుమ్మరించీ సిగ్గు గోవిందుఁడు
(||pallavi||)
o yamma yaśhoda vŏddanna mānam̐ḍu
khoyani yārisī goviṁdum̐ḍu
(||oya||)
payyĕda lĕḍalam̐ baṭṭĕru gŏllĕda
lŏyyana tām̐ gŏṭṭī nuṭlu
tiyyanibĕrugu tenĕ vāravaṭṭī
kūyam̐gam̐ gūyam̐ga goviṁdum̐ḍu
(||oya||)
sāḍĕlu diyyusu sadulu navvam̐ga
āḍavārisannu laṭṭĕ tīsī
yeḍagaina sām̐sī lĕttina kolalu
koḍĕgām̐ḍu gadĕ goviṁdum̐ḍu
(||oya||)
yĕmmĕlu nĕrabī yiṁdirayum̐ dānu
ammaro śhrī veṁkaḍādri vīthulanu
kammi gobigalu kām̐giḍam̐ gūḍam̐ga
kummariṁchī siggu goviṁdum̐ḍu