O po baalagi naado nobuduvade

ఓ పో బాలకి నాతో నోపుదువటె
Language

(॥పల్లవి॥)
ఓ పో బాలకి నాతో నోపుదువటె
చేపట్టు జలధి దాఁట చిన్నివోడే కాదా

(॥ఓపో॥)
పువ్వుగాని పిందెగాని పూఁపవయసుపడుచ
యివ్వల నన్నుఁ జెనకే వేలే నీవు
పువ్వులపూఁపలే కావా పొదలిఫలించేవి
చివ్వల వోరమణుఁడ చెల్లదటయ్యా

(॥ఓపో॥)
నల్లగాని తెల్లగాని నాఁటుఁజూపులపడుచ
యెల్లచూపి మాఁటలాడేవేలే నాతో
నల్లదెల్లలే కావా నడురేయి పగలయి
చిల్ల రేలెండలయ్యీ చింతించవయ్యా

(॥ఓపో॥)
తగ్గులేని మొగ్గులేని తమకపుకాఁగిటను
యెగ్గుసిగ్గులేక కూడేవేమే నన్ను
తగ్గుమొగ్గులేని యట్టిదైవపుశ్రీవేంకటేశ
అగ్గమైతి వంతనిచ్చి ఆడనేఁటికయ్యా

(||pallavi||)
o po bālagi nādo nobuduvaḍĕ
sebaṭṭu jaladhi dām̐ṭa sinnivoḍe kādā

(||obo||)
puvvugāni piṁdĕgāni pūm̐pavayasubaḍusa
yivvala nannum̐ jĕnage vele nīvu
puvvulabūm̐pale kāvā pŏdaliphaliṁchevi
sivvala voramaṇum̐ḍa sĕlladaḍayyā

(||obo||)
nallagāni tĕllagāni nām̐ṭum̐jūbulabaḍusa
yĕllasūbi mām̐ṭalāḍevele nādo
nalladĕllale kāvā naḍureyi pagalayi
silla relĕṁḍalayyī siṁtiṁchavayyā

(||obo||)
tagguleni mŏgguleni tamagabugām̐giḍanu
yĕggusiggulega kūḍeveme nannu
taggumŏgguleni yaṭṭidaivabuśhrīveṁkaḍeśha
aggamaidi vaṁtanichchi āḍanem̐ṭigayyā