నూఁటికి సెలవు గాఁగ నూలిపోఁగే యందురు
(॥పల్లవి॥)
నూఁటికి సెలవు గాఁగ నూలిపోఁగే యందురు
యేఁటి కిఁక మాఁట లెల్లా నిందులోనే వున్నవి
(॥నూఁటికి॥)
నిండు విరహతాపాన నీవు రాని కోపాన
అండ నే మని దూరి నే నంటినో నిన్ను
వుండుసుద్దు లేల యిఁక వొక్క మాఁటే మొక్కే మిదే
చండి పెట్టి యే మన్నాఁ జవి గాదు ప్రియము
(॥నూఁటికి॥)
చెప్పుడు మాఁటలకుఁ గా చిత్తము నిలుప లేక
వుప్పటించి నిన్ను నెంత వొరసితివో
ముప్పిరి నాకందు వాయ ముందటికి వచ్చితిమి
యిప్పు డిఁక నే మన్నా నెరవు లై తోఁచును
(॥నూఁటికి॥)
చెఱఁగు వట్టి తియ్యఁ గా సిగ్గునఁ దప్పించుకోంటా
తఱి నాకొనగో రెందు దాఁకించితినో
నెఱి శ్రీవెంకటేశుఁడ నే నందుకే కూడితిని
మొఱఁగు మరఁగు లేదు ముంచుకొనీ నవ్వులు
(||pallavi||)
nūm̐ṭigi sĕlavu gām̐ga nūlibom̐ge yaṁduru
yem̐ṭi kim̐ka mām̐ṭa lĕllā niṁdulone vunnavi
(||nūm̐ṭigi||)
niṁḍu virahadābāna nīvu rāni kobāna
aṁḍa ne mani dūri ne naṁṭino ninnu
vuṁḍusuddu lela yim̐ka vŏkka mām̐ṭe mŏkke mide
saṁḍi pĕṭṭi ye mannām̐ javi gādu priyamu
(||nūm̐ṭigi||)
sĕppuḍu mām̐ṭalagum̐ gā sittamu niluba lega
vuppaḍiṁchi ninnu nĕṁta vŏrasidivo
muppiri nāgaṁdu vāya muṁdaḍigi vachchidimi
yippu ḍim̐ka ne mannā nĕravu lai tom̐sunu
(||nūm̐ṭigi||)
sĕṟam̐gu vaṭṭi tiyyam̐ gā siggunam̐ dappiṁchugoṁṭā
taṟi nāgŏnago rĕṁdu dām̐kiṁchidino
nĕṟi śhrīvĕṁkaḍeśhum̐ḍa ne naṁduge kūḍidini
mŏṟam̐gu maram̐gu ledu muṁchugŏnī navvulu