(॥పల్లవి॥)
నూటి కొక్కటే నూలిపోఁగని
కూటువలె కైకొను టిఁకఁగాక
(॥నటి॥)
చెనకుచుఁ దొలఁగెనుఁ జేరఁగ వచ్చెను
తను విఁక నేమని తడవేనే
వెనకకి కోపము వేడుక లిప్పుడు
కనుఁగొన మింగినకడి కిఁకఁ జవులా
(॥నటి॥)
బిగువూఁ జూపెను ప్రియమూఁ జెప్పెను
తగవులఁ బెట్టఁగ తతి గాదే
తెగవులె అప్పుడు మొగమో టిప్పుడు
జగడము దీరెను సాదించవలెనా
(॥నట॥)
కాఁకలు రేఁచెను కాఁగిటఁ గూడెను
సోఁకుచు నిఁక మరి సొలసేనా
యేఁకట శ్రీవేంకటేశుఁడు వాపెను
చీఁకటి వాసెను చేదీపమేలే
(||pallavi||)
nūḍi kŏkkaḍe nūlibom̐gani
kūḍuvalĕ kaigŏnu ṭim̐kam̐gāga
(||naḍi||)
sĕnagusum̐ dŏlam̐gĕnum̐ jeram̐ga vachchĕnu
tanu vim̐ka nemani taḍavene
vĕnagagi kobamu veḍuga lippuḍu
kanum̐gŏna miṁginagaḍi kim̐kam̐ javulā
(||naḍi||)
biguvūm̐ jūbĕnu priyamūm̐ jĕppĕnu
tagavulam̐ bĕṭṭam̐ga tadi gāde
tĕgavulĕ appuḍu mŏgamo ṭippuḍu
jagaḍamu dīrĕnu sādiṁchavalĕnā
(||naḍa||)
kām̐kalu rem̐sĕnu kām̐giḍam̐ gūḍĕnu
som̐kusu nim̐ka mari sŏlasenā
yem̐kaḍa śhrīveṁkaḍeśhum̐ḍu vābĕnu
sīm̐kaḍi vāsĕnu sedībamele