Title (Indic)అవును నిజం నువ్వంటే నాకిష్టం WorkAthadu Year2005 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Suneeda Performer Ke.ke. Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం చలి పరదా ఇక నిలవదుగా హువా .. హువా .. హువా తెలుసు కదా... ఆ... ఆ... ఆ... హువా .. హువా .. హువా తెలిసిందే అడగాలా అడగందే అనవేలా చెవిలో .......ఇలా చెబితే చాలా ! చరణం 1: కసిరేస్తున్నా ..మనసుకి వినపడదో ఏమో విసిరేస్తున్నా ..నిను విడి వెనుకకు రాదేమో నిదరోతున్నా ..ఎదురై కనబడతావేమో కదలాలన్నా ..కుదరని మెలి పెడతావేమో అంతగా ..కంట చూడనని మొండికేస్తే తప్పేమో ఒంటిగా .. ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో మన సలహా మది వినదు కదా హువా .. హువా .. హువా తెలుసు కదా... ఆ... ఆ... ఆ... హువా .. హువా .. హువా తెలిసే ......ఇలా చెలరేగాలా ! చరణం 2: సుడిగాలిలో .. తెలియని పరుగులు తీస్తున్నా జడపూలతో .. చెలిమికి సమయము దొరికేనా ఎదరేముందో .. తమరిని వివరములడిగానా ఎద ఏమందో .. వినమని తరుముకు రాలేనా తప్పుకో .. కళ్ళు మూసుకుని తుళ్ళి రాకే నా వెంటా ఒప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా నడపదుగా నిను నది వరదా .. హువా .. హువా .. హువా తెలుసు కదా... ఆ... ఆ... ఆ... హువా .. హువా .. హువా తెలిసే ఇలా... ముంచెయ్యాలా !!! Englishpallavi: avunu nijaṁ nuvvaṁṭe nāgiṣhṭaṁ ī nimiṣhaṁ gurdiṁchā ā satyaṁ sali paradā iga nilavadugā huvā .. huvā .. huvā tĕlusu kadā... ā... ā... ā... huvā .. huvā .. huvā tĕlisiṁde aḍagālā aḍagaṁde anavelā sĕvilo .......ilā sĕbide sālā ! saraṇaṁ 1: kasirestunnā ..manasugi vinabaḍado emo visirestunnā ..ninu viḍi vĕnugagu rādemo nidarodunnā ..ĕdurai kanabaḍadāvemo kadalālannā ..kudarani mĕli pĕḍadāvemo aṁtagā ..kaṁṭa sūḍanani mŏṁḍigeste tappemo ŏṁṭigā .. uṁḍanīyanani muṁdugŏste muppemo mana salahā madi vinadu kadā huvā .. huvā .. huvā tĕlusu kadā... ā... ā... ā... huvā .. huvā .. huvā tĕlise ......ilā sĕlaregālā ! saraṇaṁ 2: suḍigālilo .. tĕliyani parugulu tīstunnā jaḍabūlado .. sĕlimigi samayamu dŏrigenā ĕdaremuṁdo .. tamarini vivaramulaḍigānā ĕda emaṁdo .. vinamani tarumugu rālenā tappugo .. kaḽḽu mūsuguni tuḽḽi rāge nā vĕṁṭā ŏppugo.. ninnu nammamani alluguṁṭā nī jaṁṭā naḍabadugā ninu nadi varadā .. huvā .. huvā .. huvā tĕlusu kadā... ā... ā... ā... huvā .. huvā .. huvā tĕlise ilā... muṁchĕyyālā !!!