Title (Indic)జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాద& WorkChakram Year2005 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Shree Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది చరణం 1: కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగావల్లులన్ని కావ్య కన్యలన్ని ఆడపిల్లలని చరణం 2: మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కానరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని చరణం 3: గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి Englishpallavi: jagamaṁtā kuḍuṁbaṁ nādi egāgi jīvidaṁ nādi jagamaṁtā kuḍuṁbaṁ nādi egāgi jīvidaṁ nādi saṁsāra sāgaraṁ nāde sanyāsaṁ śhūnyaṁ nāve jagamaṁtā kuḍuṁbaṁ nādi egāgi jīvidaṁ nādi saraṇaṁ 1: kavinai kavidanai bhāryanai bhardanai kavinai kavidanai bhāryanai bhardanai mallĕla dārilo maṁchu ĕḍārilo mallĕla dārilo maṁchu ĕḍārilo pannīḍi jayagīdāla kannīḍi jalabādāla nādo nenu anugamistū nādo nene ramistū vaṁṭarinai anavaradaṁ kaṁṭunnānu niraṁtaraṁ kalalni kathalni māḍalni pāḍalni raṁgulnī raṁgāvallulanni kāvya kanyalanni āḍabillalani saraṇaṁ 2: miṁṭigi kaṁṭini nenai kaṁṭanu maṁṭanu nenai miṁṭigi kaṁṭini nenai kaṁṭanu maṁṭanu nenai maṁṭala māḍuna vĕnnĕla nenai vĕnnĕla pūdala maṁṭanu nenai ravinai śhaśhinai divamai niśhinai nādo nenu sahagamistū nādo nene ramistū vaṁṭarinai pradinimiṣhaṁ kaṁṭunnānu niraṁtaraṁ kiraṇālni kiraṇāla hariṇālni hariṇāla saraṇālni saraṇāla salanāna kānarāni gamyāla kālānni iṁdra jālānni saraṇaṁ 3: gāli pallagīlona tarali nā pāḍa pāba ūregi vĕḍalĕ gŏṁtu vāgilini mūsi marali tanu mūgaboyi nā guṁḍĕ migilĕ nā hṛdayame nā logili nā hṛdayame nā pāḍagi talli nā hṛdayame nāgu āli nā hṛdayamulo idi sinīvāli