Title (Indic)నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా WorkBalu Year2005 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Shreyagoshal Performer Hariharan Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఒప్పుకోవే ఇకనైనా సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా చరణం 1: ప్రతిరోజు నడిరాతిరిలో చేస్తావా స్నానాలు ఒళ్ళంతా చెమటలు పడితే తప్పవుగా చన్నీళ్ళు వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు ఉడికించే ఆలోచనలూ పుడుతున్నవి కాబోలు ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు అదిగో ఆ ఉలుకే చెబుతుంది నువు దాచాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా చరణం 2: ఒంట్లో బాగుంటం లేదా ఈ మధ్యన నీకసలు నాకేం ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు వెంటాడే కలలొస్తుంటే నిదరుండదు తెల్లార్లు ఐతేమరి నువ్వెపుడు కనలేదా ఈ కలలు నా కలలో ఏనాడు నువు రాలేదిన్నాళ్ళు అదిగో ఆ మాటే నీనోటే చెప్పించాలనుకున్నా దీన్నే లవులో పడిపోటం అంటున్నా ఊ... అవునా ఏమో నే కాదనలేకున్నా చరణం 3: నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారే మైనా నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో అంటే అన్నానంటూ కోపాలేనా నువ్వే చెప్పు నే తప్పన్నానా పోన్లే నీకేంటంటా నాకేమైనా ఏదో సాయం నిన్నిమ్మన్నానా వలపంటే నిప్పులాంటిది కలకాలం దాచలేనిది సలహా విని ఓప్పుకోవే ఇకనైనా ఆ..సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది ఐనా ముందు నీకే తెలిసేనా........ Englishpallavi: nīlo jarigedaṁtū sūstūne unnā dīnne tŏliprema aṁṭāre mainā edo jarigiṁdaṁṭū nīdo sĕppānā sālle iṭṭāṁṭivi sālā ne vinnā aṁṭe annānaṁṭū kobālenā nuvve sĕppu ne tappannānā ponle nīgeṁṭaṁṭā nāgemainā edo sāyaṁ ninnimmannānā valabaṁṭe nippulāṁṭidi kalagālaṁ dāsalenidi salahā vini ŏppugove iganainā sarle ī prema saṁgadi nālāge nīgu kŏttadi ainā muṁdu nīge tĕlisenā saraṇaṁ 1: pradiroju naḍirādirilo sestāvā snānālu ŏḽḽaṁtā sĕmaḍalu paḍide tappavugā sannīḽḽu vaṇigiṁche saligālaṁlo emā āvirlu uḍigiṁche ālosanalū puḍudunnavi kābolu iṁtidigā veḍĕkke ūhalu rebiṁdĕvaru nīlā nanu vedhiṁche duṣhṭulu ĕvaruṁṭāru adigo ā uluge sĕbuduṁdi nuvu dāsālanugunnā dīnne lavulo paḍiboḍaṁ aṁṭunnā sālle iṭṭāṁṭivi sālā ne vinnā saraṇaṁ 2: ŏṁṭlo bāguṁṭaṁ ledā ī madhyana nīgasalu nāgeṁ ĕṁchakkā unnā nīgĕṁdugu ī digulu aṁtā sarigāne uṁṭe ĕrubĕkkāyeṁ kaḽḽu vĕṁṭāḍe kalalŏstuṁṭe nidaruṁḍadu tĕllārlu aidemari nuvvĕbuḍu kanaledā ī kalalu nā kalalo enāḍu nuvu rāledinnāḽḽu adigo ā māḍe nīnoḍe sĕppiṁchālanugunnā dīnne lavulo paḍiboḍaṁ aṁṭunnā ū... avunā emo ne kādanalegunnā saraṇaṁ 3: nīlo jarigedaṁtū sūstūne unnā dīnne tŏliprema aṁṭāre mainā nālo jarigedaṁtū sūstūne unnā dīnne tŏliprema aṁṭāro emo aṁṭe annānaṁṭū kobālenā nuvve sĕppu ne tappannānā ponle nīgeṁṭaṁṭā nāgemainā edo sāyaṁ ninnimmannānā valabaṁṭe nippulāṁṭidi kalagālaṁ dāsalenidi salahā vini oppugove iganainā ā..sarle ī prema saṁgadi nālāge nīgu kŏttadi ainā muṁdu nīge tĕlisenā........