Nivveragudoduda needikku soodumgaaga

నివ్వెరగుతోడుత నీదిక్కు చూతుఁగాక
Language

(॥పల్లవి॥)
నివ్వెరగుతోడుత నీదిక్కు చూతుఁగాక
అవ్వలివారి దూర నరుహమా నాకు

(॥నివ్వె॥)
గరిమ నీవెవ్వతె నక్కడఁ బొందు సేసుకొన్నా
సరివెట్టు కాపెతో జగడించేనా
నిరతి నేఁజూడఁగానె నీవు నాపె నవ్వినాను
యెరవులు సేసుకొని యెగసక్కె మాడేనా

(॥నివ్వె॥)
యెలమి నెవ్వతె నాకు నెదురుగాఁ బెట్టినాను
మలసి సరకుసేసి మాటలాడేనా
నలిరేఁగి మీలో సన్నలు సేసుకొన్నాను
చలపట్టి నేనది సడ్డసేసేనా

(॥నివ్వె॥)
కందువ నెవ్వతెచేతికానుక నీవందుకొన్నా
చెందియది గురిసేసి చెప్పవచ్చేనా
అంది శ్రీవెంకటేశ్వర అలమేలుమంగను నేను
అందముగా నన్నేలితి వాపె నిఁక మెచ్చేనా

(||pallavi||)
nivvĕragudoḍuda nīdikku sūdum̐gāga
avvalivāri dūra naruhamā nāgu

(||nivvĕ||)
garima nīvĕvvadĕ nakkaḍam̐ bŏṁdu sesugŏnnā
sarivĕṭṭu kābĕdo jagaḍiṁchenā
niradi nem̐jūḍam̐gānĕ nīvu nābĕ navvinānu
yĕravulu sesugŏni yĕgasakkĕ māḍenā

(||nivvĕ||)
yĕlami nĕvvadĕ nāgu nĕdurugām̐ bĕṭṭinānu
malasi saragusesi māḍalāḍenā
nalirem̐gi mīlo sannalu sesugŏnnānu
salabaṭṭi nenadi saḍḍasesenā

(||nivvĕ||)
kaṁduva nĕvvadĕsedigānuga nīvaṁdugŏnnā
sĕṁdiyadi gurisesi sĕppavachchenā
aṁdi śhrīvĕṁkaḍeśhvara alamelumaṁganu nenu
aṁdamugā nannelidi vābĕ nim̐ka mĕchchenā